Telangana: అలకలు.. బుజ్జగింపులు.. కాంగ్రెస్‌లో చల్లారని మంత్రివర్గ విస్తరణ మంటలు..
ఒకవైపు సంతోషం, మరోవైపు అలకలు, ఇంకోవైపు బుజ్జగింపులు.. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ తర్వాత కాంగ్రెస్ పార్టీలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. మంత్రి పదవులు దక్కిన వారు అధిష్ఠాన పెద్దలను, రాష్ట్ర నాయకులను కలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు ఇలా..

ఒకవైపు సంతోషం, మరోవైపు అలకలు, ఇంకోవైపు బుజ్జగింపులు.. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ తర్వాత కాంగ్రెస్ పార్టీలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. మంత్రి పదవులు దక్కిన వారు అధిష్ఠాన పెద్దలను, రాష్ట్ర నాయకులను కలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పదవులపై భారీగా ఆశలు పెట్టుకున్న సీనియర్లు మాత్రం బుజ్జగింపులతో కాస్త మెత్తబడినా అలక మాత్రం వీడలేదని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు.. సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి.. పదవులను ఆశించి భంగపడ్డారు.
వీరితో.. మీనాక్షి నటరాజన్, మహేష్‌కుమార్‌గౌడ్ చర్చించి.. అందరికీ సర్ది చెప్పారు. మొదట బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డే బుజ్జగింపులకు అంగీకరించి.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు. కట్ చేస్తే.. ఇవాళ ఆయన అనుచరులు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు బోధన్ బంద్‌కు పిలుపునిచ్చారు. మంత్రి పదవి రాలేదని అసంతృప్తిలో ఉన్న MLA మల్‌రెడ్డి రంగారెడ్డిని మంత్రి శ్రీధర్‌బాబు కలిశారు. పదేళ్లు మల్‌రెడ్డి పార్టీ కోసం ఎంతో పనిచేశారని, ఈ అంశం సీఎం దృష్టిలో ఉందని, అధిష్ఠానం కూడా మల్‌రెడ్డిని గుర్తిస్తుందని భరోసా ఇచ్చారు మంత్రి శ్రీధర్‌బాబు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి