ముక్క లేనిదే ముద్ద దిగదు.. మాంసాహారంలో తెలంగాణ టాప్
పండగ ఏదైనా నాన్ వెజ్‌తో "పండగ చేసుకోవడం" మెజారిటీ తెలంగాణ వాసుల సంప్రదాయం. అందుకే మాంసం వినియోగం ఇక్కడ ఎక్కువ. అయితే, దేశంలో అత్యధికంగా మాంసం తినే రాష్ట్రాలు ఏవో గతంలో నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే వివరాలు సేకరించింది. మన దేశంలో నాన్ వెజ్ తినడంలో టాప్ 10లో ఉన్న రాష్ట్రాలేవో ప్రకటించింది.
మరి, ఆ సర్వే ప్రకారం తెలంగాణ నంబర్ ఎంత అంటే తెలంగాణ రాష్ట్రం ఏడో స్థానంలో ఉన్నట్లు తెలిసింది. ఇక్కడ మటన్, చికెన్, ఫిష్ తినేవాళ్ల సంఖ్య ఎక్కువ. జనాభాలో 97.4 శాతం మంది మాంసాహారం తింటారని NHFS తెలిపింది. తాజాగా జరిపిన సర్వేలో మాంసాహార ఉత్పత్తిలోనే కాదు.. తినడంలో కూడా తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్‌గా దూసుకుపోతోంది. తెలంగాణలో నాన్ వెజ్ ప్రియులు.. ఎక్కువ శాతం మాంసం తింటున్నారని తాజాగా వెల్లడైంది. అంతేకాదు ఇండియా వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల లెక్కల ప్రకారం ఎక్కువగా మాంసం తింటున్న రాష్ట్రంగా మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది. నేషనల్ శాంపిల్ సర్వే నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డేటా ప్రకారం… ఇండియాలోనే ఎక్కువ శాతం మాంసం తినే రాష్ట్రంగా తెలంగాణ రికార్డుల్లోకెక్కింది. ఈ సర్వే లెక్కల ప్రకారం.. ఏడాదిలో తెలంగాణ రాష్ట్రంలోని ఒక వ్యక్తి యావరేజ్ గా.. 23.97 కిలోలు మాంసం ఆహారంగా తీసుకుంటున్నారు. అంటే దాదాపుగా ప్రతి నెల రెండు కిలోల చొప్పున ఒక వ్యక్తి మాంసం తింటున్నట్లు తెలిసింది. ఈ రేంజ్ లో ఏ రాష్ట్రంలో కూడా మాంసం తినేవాళ్లు లేరని ఈ లెక్కలు చెబుతున్నాయి. ఇది జాతీయ యావరేజ్ 7 కిలోల కంటే మూడు రెట్లు ఎక్కువ. మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రం మద్యం విక్రయాలలో నెంబర్ వన్ అనుకుంటే… ఇప్పుడు మాంసం తినే వారిలో కూడా… మొదటి స్థానానికి వచ్చిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి కొంతమంది తెలంగాణలో మాంసం ధర కేజీ వెయ్యి రూపాయలు దాటినా విక్రయాలు తగ్గలేదని అంటున్నారు. చికెన్ సప్లైతో పోల్చితే మేక మాంసం స్టాక్స్ మరో ఆరు నెలల వరకే ఉంది. ఆ తర్వాత కేజీ 1500 రూపాయలకు చేరే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాములా ప్రవర్తిస్తూ యువతి వింత చేష్టలు.. ఆ గ్రామంలో వింత ఘటన!
ఆయుష్షు గట్టిది అంటే ఇదే.. పెను ప్రమాదంలో కూడా
పిల్లాడితో కలిసి ఫుట్‌బాల్ ఆడిన కాకి.. వీడియో వైరల్
103 ఏళ్ల బామ్మ మేకప్ పాఠాలు.. ఫిదా అవుతున్న యూత్
లాటరీలో వచ్చిన రూ.30 కోట్లు ప్రియురాలి అకౌంట్లో వేశాడు.. మరుక్షణం ఆమె

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్‌తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..

ఎవరెస్ట్ శిఖరం వద్ద కింగ్ కోబ్రాస్ కలకలం! ప్రమాదపు అంచున ఉన్నామా.

కోతుల వీరంగానికి కొండముచ్చుతో చెక్.. గ్రామాల్లో కొత్త ట్రెండ్

ఒకే గుంతలో పులి, కుక్క.. తర్వాత ఏం జరిగిందంటే..

కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో

ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
