ఆయుష్షు గట్టిది అంటే ఇదే.. పెను ప్రమాదంలో కూడా
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యపోయేవిగా ఉంటే, కొన్ని ఆనందాన్నిస్తాయి. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం.. అక్కడ ఓ నాలుగు రోడ్ల కూడలి ఉంది.
ఆ రోడ్డు వంతెన మీదుగా ఉంది. ఓ వైపు రోడ్డుపై వస్తున్న వ్యాన్ ఒకటి లెఫ్ట్ టర్న్ తీసుకొని వంతెన మీదుగా వెళ్తోంది. అదే సమయంలో మరోవైపు నుంచి ఓ బైకుపైన ముగ్గురు యువకులు వేగంగా వస్తున్నారు. వాస్తవానికి ఈ బైకు కూడా ఆ వంతెన మీదుగా వెళ్లాలి. ఈ క్రమంలో వేగంగా వస్తున్న బైకు వ్యానును ఎక్కడ ఢీకొడుతుందోనని కాస్త తడబడ్డారు ఆ యువకులు. దాంతో అదుపుతప్పి ఆ బైకు నేరుగా కాల్వలోకి దూసుకెళ్లింది. బైకు వెనుక చివరన కూర్చున్న వ్యక్తి ప్రమాదాన్ని పసిగట్టి అలర్టయ్యాడు. బైకు కాల్వలోకి దూసుకెళ్తున్నప్పుడు ఎంతో చాకచక్యంగా వంతెనకు గ్రిల్‌లా ఏర్పాటుచేసిన ఇనుపరాడ్‌ను పట్టుకొని తప్పించుకున్నాడు. మిగతా ఇద్దరూ బైకుతో సహా కాల్వలో పడిపోయారు. ఇదంతా అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోను కొన్ని గంటల్లోనే 3 లక్షల మందికిపైగా వీక్షించారు. వేలాదిమంది లైక్ చేశారు. తమదైన శైలిలో కామెంట్లు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పిల్లాడితో కలిసి ఫుట్‌బాల్ ఆడిన కాకి.. వీడియో వైరల్
103 ఏళ్ల బామ్మ మేకప్ పాఠాలు.. ఫిదా అవుతున్న యూత్
లాటరీలో వచ్చిన రూ.30 కోట్లు ప్రియురాలి అకౌంట్లో వేశాడు.. మరుక్షణం ఆమె
ఈ యువకుడి ఐడియాను మెచ్చుకోకుండా ఉండలేరు..
పాములను పట్టి అడవిలో వదులుదామని వెళ్లిన స్నేక్ క్యాచర్‌కు ఊహించని షాక్

విందులో మందు లేదని కుటుంబాన్ని వెలేసిన గ్రామస్తులు వీడియో

జగిత్యాలలో ఎల్లో ఫ్రాగ్స్ కలకలం దేనికి సంకేతమో తెలుసా?వీడియో

వీడు మామూలోడు కాదు.. ప్రియురాలి కోసం.. వీడియో

వామ్మో.. అంతటి జెర్రిపోతును అమాంతం మింగేసిందిగా వీడియో

ఓర్నీ.. వధువుకి పువ్వు ఇవ్వడానికి వరుడు పడిన కష్టం చూస్తే నవ్వడమే

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..
