103 ఏళ్ల బామ్మ మేకప్ పాఠాలు.. ఫిదా అవుతున్న యూత్
మన అమ్మమ్మలు, నాన్నమ్మలతో గడిపే క్షణాలు మనకు ఎంతో ఆనందాన్నిస్తాయి. అదో సంతోషకరమైన అనుభవంగా మన మదిలో మెదులుతుంది. వాళ్లకున్న అనుభవాలు, వాళ్లు చెప్పే కథలు, చేతి వంటలు.. అన్నీ మనకు చిన్ననాటి నుంచి తెలుసు. కానీ వాళ్లకూ ఫ్యాషన్, టెక్నాలజీ, సోషల్ మీడియా మీద అంతే ఆసక్తి ఉందంటే నమ్మగలరా? వంట చేయడం, కథలు చెప్పడం, పుస్తకాలు చదవడం మాత్రమే కాదు..
సోషల్ మీడియాను శాసించే టాలెంట్ కూడా వాళ్లకు ఉందని నిరూపించింది ఇంగ్లండ్‌కు చెందిన జోన్ పార్ట్‌రిడ్జ్. ఈమె వయసు ఏకంగా 103 ఏళ్లు! టిక్‌టాక్‌లో రోజూ హాస్యాస్పదమైన మేకప్ ట్యూటోరియల్స్‌తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఇంగ్లండ్‌కు చెందిన జోన్ పార్ట్‌రిడ్జ్ బామ్మ ప్రస్తుతం సోషల్ మీడియా సెన్సెషన్. ఆమె చేసే మేకప్ ట్యూటోరియల్స్ టిక్‌టాక్‌లో లక్షలాది మంది చూసి ఆశ్చర్యపోతున్నారు. మేకప్ బ్రష్ పట్టుకొని తన ప్రత్యేకమైన స్టైల్‌లో బ్యూటీ టిప్స్ చెప్తుంది. ‘బ్లష్ వేయాలంటే నవ్వుతూ వేయమంటారు కానీ తను నవ్వితే ముడతలే కనిపిస్తాయి అనే డైలాగ్‌తో ఈ బామ్మ మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఈ ఒక్కటే కాదు, ఆమె చెప్పే ప్రతి మాటలోనూ చమత్కారం దాగి ఉంటుంది. అందుకే సుమారు రెండున్నర లక్షల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. బామ్మ టెక్నిక్స్ చూసి కొంతమంది మేకప్ పద్ధతులు నేర్చుకుంటే, మరికొందరు ఆమె హాస్యాన్ని ఆస్వాదిస్తున్నారు. టిక్‌టాక్ ద్వారా ఫేమస్ అయిన ఈ బామ్మని ఇంటర్వ్యూకు పలు టీవీ చానళ్లూ, అంతర్జాతీయ మీడియా సంస్థలూ పిలుస్తున్నారు. ఆమె వీడియోల్లో చూపిన మేకప్ ఐటమ్స్‌ను చూసి ఫాలోవర్స్ వాటిని తయారు చేసే బ్రాండ్స్‌ను ట్యాగ్ చేయడంతో, ఆ బ్రాండ్స్ బామ్మకి గిఫ్ట్ హ్యాంపర్లు పంపిస్తుంటాయి. దీంతో జోన్ పార్ట్‌రిడ్జ్ ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా మారింది. వందేళ్ల వయసులోనూ ఆమె టిక్‌టాక్ స్టార్ మాత్రమే కాకుండా, బ్యూటీ గురువుగా, మేకప్ మెంటర్‌గా ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లాటరీలో వచ్చిన రూ.30 కోట్లు ప్రియురాలి అకౌంట్లో వేశాడు.. మరుక్షణం ఆమె
ఈ యువకుడి ఐడియాను మెచ్చుకోకుండా ఉండలేరు..
పాములను పట్టి అడవిలో వదులుదామని వెళ్లిన స్నేక్ క్యాచర్‌కు ఊహించని షాక్
బ్యాగుల్లో అరుదైన పాములు.. ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవగానే

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
