ఈ యువకుడి ఐడియాను మెచ్చుకోకుండా ఉండలేరు..
భారతదేశంలో మట్టిలో మాణిక్యాలే కాదు.. పట్టాలేని పట్టభద్రులకూ కొదవ లేదు. మనిషి తన కోర్కెలు నెరవేరే దారి లేనప్పుడు ఉన్నవాటినే తన అవసరాలకు అనుగుణంగా మలచుకుంటాడు. ఇలాంటివారు మనదేశంలో కోకొల్లలు. తమ వినూత్న ఐడియాలతో కొత్త కొత్త జుగాడ్‌లను తయారు చేస్తుంటారు. అలాంటి ఎన్నో వీడియోలు మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం.
తాజాగా ఓ యువకుడు తన సైకిలను అద్భుతమైన మోటారు బైక్‌గా మార్చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. అతని ఐడియాను మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ఓ వ్యక్తి మోటార్ సహాయంతో సైకిల్‌ను 65 కి.మీ మైలేజీ ఇచ్చే బైక్‌గా మార్చేశాడు. ఈ సైకిల్‌ను తయారు చేయడానికి, ఆ వ్యక్తి తన సైకిలు ముందు చక్రానికి ఓ స్టాండ్ లాంటిది అమర్చాడు. దానిపైన ఇంట్లో అదనంగా పడి ఉన్న ఓ మోటారును బిగించాడు. ఆ మోటారుకు పెట్రోలు ఉన్న ఒక డబ్బాను ట్యాంక్‌లాగా ఏర్పాటు చేశాడు. తర్వాత ఆ మోటారుకు, సైకిల్ హ్యాండిల్‌కు కనెక్ట్ చేశాడు. హ్యాండిల్ తిప్పగానే మోటారు ఆన్ అయి సైకిలు బైకులాగా ముందుకు వెళ్తోంది. అది ఏకంగా గంటకు 65 కి.మీ వేగంతో పరిగెడుతుందని ఆ వ్యక్తి చెబుతున్నాడు. ఇక తనకు బైక్ కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదంటున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేశారు. ఈ జుగాడ్ చాలా బావుంది బ్రో అని ఒకరు, ఇది చూసాక మోటార్ సైకిల్ తయారీ కంపెనీలకు భయ పట్టుకుంటుందని మరొకరు కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాములను పట్టి అడవిలో వదులుదామని వెళ్లిన స్నేక్ క్యాచర్‌కు ఊహించని షాక్
బ్యాగుల్లో అరుదైన పాములు.. ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవగానే
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్‌డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

