బ్యాగుల్లో అరుదైన పాములు.. ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవగానే
ఇద్దరు వ్యక్తులు బ్యాంకాక్ నుంచి బ్యాగుల్లో విషపూరిత, అరుదైన పాములను తీసుకొస్తూ శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు చిక్కారు. అధికారుల కళ్లు గప్పి బ్యాంకాక్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 31 అరుదైన పాములు, తాబేళ్లను శనివారం శంషాబాద్ విమానాశ్రయం అధికారులు పట్టుకున్నారు. నిందితులు ముంబైకి చెందిన షేక్ నిజాముద్దీన్, షేక్ అల్తాఫ్ అలీగా గుర్తించారు.
బ్యాంకాక్ నుంచి వచ్చిన ఈ ఇద్దరు వ్యక్తులు ఇండిగో ఎయిర్‌లైన్స్ 6ఈ-1066 విమానంలో శంషాబాద్‌లో దిగారు. వారి ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించడంతో ఎయిర్‌పోర్ట్ అధికారులు వారిని చెక్ చేశారు. వారి లగేజ్‌లో ప్రాణాలతో ఉన్న 28 రెడ్ టెయిల్డ్ బాంబూ పిట్ వైపర్‌లు, మూడు స్పైడర్ టెయిల్డ్ హార్మ్‌డ్ వైపర్‌లు, ఆరు తాబేళ్లను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని విమానాశ్రయం అధికారులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంటిబయట బట్టలు ఆరేస్తున్నారా.. జాగ్రత్త
బయటపడ్డ వెయ్యి టన్నుల బంగారం కొండ.. లెక్క చూస్తే..
వాటర్ బాటిల్‌తో ఇంత లైటింగ్ వస్తుందా.. ఐడియా అదుర్స్..!
మామిడి పండ్లను రాత్రిపూట తింటున్నారా.. జాగ్రత్త..!
ప్రపంచంలోనే అతి పెద్ద శ్మశానం.. పై నుంచి చూస్తే ఇదో పెద్ద నగరం!

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
