Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే అతి పెద్ద శ్మశానం.. పై నుంచి చూస్తే ఇదో పెద్ద నగరం!

ప్రపంచంలోనే అతి పెద్ద శ్మశానం.. పై నుంచి చూస్తే ఇదో పెద్ద నగరం!

Phani CH

|

Updated on: Jun 08, 2025 | 1:04 PM

జీవితంలో ఎన్ని బాధలు అనుభవించినా ప్రతీ ఒక్కరికీ మృత్యువుతో ప్రశాంతత లభిస్తుంది. అందుకే ఇలాంటి ప్రదేశంలో తమ అంత్యక్రియలు జరగాలని కోరుకుంటారు. కానీ పెరుగుతున్న జనాభా కారణంగా ప్రస్తుతం ఖననం చేసేందుకు భూమి కరువైంది. ఒకరిని పూడ్చిన చోటే.. కొంతకాలం తర్వాత మరొకరిని పూడ్చడం చాలా ప్రదేశాల్లో జరుగుతోంది.

దీంతో చావులోనూ మనిషికి ప్రశాంతత లేకుండా పోతుంది. ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న జనాభాకు.. మరణించిన తర్వాత సమాధి కోసం ఎకరాల కొద్దీ స్థలం కావాల్సి వస్తోంది. దీంతో శ్మశానవాటికల విస్తీర్ణం పెరుగుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద శ్మశాన వాటిక ఎక్కడుంది. ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశానవాటిక ఇరాక్‌లోని నజాఫ్ నగరంలో ఉంది. ఈ శ్మశానవాటిక పేరు వాడి అల్ సలామ్ అంటే ‘శాంతి లోయ’. ఇది షియా వర్గాలకు అత్యంత పవిత్ర నగరం. మతపరమైన ప్రాముఖ్యత కారణంగా చాలా మంది తమ మరణం తరువాత ఇక్కడే ఖననం కావాలని కోరుకుంటారు. ఇరాక్‌లోని ఈ ప్రాంతంపై ఐసిస్‌కు పట్టు ఉంది. ఇక ఈ ప్రాంతంలో ఐసిస్‌, ఇరాక్ పారామిలటరీ బలగాల మధ్య ప్రతీరోజూ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఐసిస్‌తో ఘర్షణలు పెరిగిన తర్వాత మృతదేహాలను ఖననం చేసే ప్రక్రియ చాలా ఖరీదుగా మారింది. ఇప్పుడు దీని కోసం ప్రజలు మునుపటి కంటే రెట్టింపు మొత్తాన్ని చెల్లిస్తున్నారు. శ్మశాన వాటికలో సమాధులు పెరగడంతో భూమి విస్తీర్ణం తగ్గింది. దీంతో ఇక్కడ భూమి విలువ 2021లో 5 మిలియన్ ఇరాకీ దినార్లకు అంటే మన కరెన్సీలో 3 లక్షల రూపాయలకు పెరిగింది. కొన్ని చోట్ల దహన సంస్కారాలకు స్థలం దొరకని పరిస్థితి నెలకొంది. శాంతి లోయలో ఇప్పటిదాకా 60 లక్షలకు పైగా ముస్లింల మృతదేహాలను ఖననం చేశారు. వీరిలో చాలా మంది సుల్తానులు, శాస్త్రవేత్తలు, నాయకులు కొందరు బిచ్చగాళ్ళు కూడా ఉన్నారు. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఈ శ్మశానవాటిక 1,485.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది 1700 ఫుట్‌బాల్ మైదానాలకు సమానం. ఈ శ్మశానాన్ని పై నుంచి చూస్తే ఒక నగరంగా భ్రమపడతారు. అక్కడ సమాధులు ఇరుకైన భవనాలుగా కనిపిస్తాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ముస్లింలు దీనిని సందర్శిస్తారు. శ్మశానవాటికలో పాతిపెట్టిన తేదీల ప్రకారం ఇది మధ్యయుగాల కాలం నాటిదని యునెస్కో తెలిపింది. అల్-హీరా రాజులు, అల్-సస్సానీ యుగానికి చెందిన నాయకులను కూడా ఇక్కడ ఖననం చేసారు. భూగర్భ గదులకు మెట్ల మార్గం నిర్మించారు. స్మశానవాటికకు చాలా దగ్గరగా షియా ముస్లిమ్‌ల మొదటి ఇమామ్ అలీ బిన్ అబీ తాలిబ్ సమాధి ఉంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ దీనిని అతిపెద్ద శ్మశానవాటికగా గుర్తించింది. యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చింది. ఇరాక్ యుద్ధ సమయంలో, ప్రతిరోజూ దాదాపు 200-250 మృతదేహాలను ఇక్కడ ఖననం చేశారు. కానీ 2010లో ఈ సంఖ్య 100కి తగ్గింది. ప్రతి సంవత్సరం ఈ స్మశానవాటికలో ప్రపంచం నలుమూలల నుండి వచ్చే సుమారు 50,000 మృతదేహాలను ఖననం చేస్తుంటారు. కొన్ని సమాధులు రాజగోపురాలు, పెద్ద భవనాల మాదిరిగా ఉండటం విశేషం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ ఒక్కదానితో మసాజ్‌ చేస్తే.. చర్మం యవ్వనంగా మెరుస్తుంది

ఈ మొక్క సర్వరోగ నివారిణి..ఎక్కడ కనిపించినా వదిలిపెట్టకండి

మీరు నల్లని పాలు ఎప్పుడైనా తాగారా? పోనీ చూశారా?

ఆరోగ్యానికి ఔషధ నిధి చెన్నంగి.. తింటే చెప్పలేనన్ని లాభాలు