బయటపడ్డ వెయ్యి టన్నుల బంగారం కొండ.. లెక్క చూస్తే..
చైనా నక్క తోకను గట్టిగా తొక్కేసినట్లుంది. లేకపోతే.. 1000 టన్నుల బంగారు ఖనిజం లభించడం అంటే మాటలా? చైనాలో మరో భారీ బంగారు గని బయటపడటం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. చైనా హునాన్ ప్రావిన్స్‌లోని పింగ్జియాంగ్ కౌంటీలో ఈ భారీ బంగారు గని ఉన్నట్టు హునాన్ ప్రావిన్స్ జియోలాజికల్ బ్యూరో ప్రకటించింది.
ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద గోల్ట్ సరఫరాదారుగా ఉన్న చైనాకు మరో జాక్పాట్ తగిలినట్లైంది. భూమి లోపల 2 కిలోమీటర్ల లోతులో దీన్ని గుర్తించారు. డ్రిల్చేసిన అనేక రాళ్లను పరిశీలిస్తే బంగారం ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. ఒకే చోట 1000 టన్నులు ఉందని చెబుతున్నారు. పైగా.. ఈ బంగారం ప్యూర్ క్వాలిటీతో ఉంది అంటున్నారు. ఇది నిజమే అయి ఉండొచ్చు. ఎందుకంటే.. బంగారం మిగతా లోహాలతో కలవదు. విడిగానే ఉంటుంది. అది దాని ప్రత్యేక లక్షణం. అందువల్ల భూమిలో బంగారం దొరికితే, అది ప్యూర్ గానే ఉంటుంది. ఈ బంగారం విలువ రూ.7 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇప్పటివరకు అతిపెద్ద బంగారు గని రికార్డు సౌత్ఆఫ్రికాలోని ‘సౌత్ డీప్ మైన్’ పేరు మీద ఉంది. ఈ గనిలో 930 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. చైనాలో గుర్తించిన మైన్ ఈ రికార్డును బద్దలుగొట్టింది. ఓ అంచనా ప్రకారం.. 3 కిలోమీటర్ల పరిధిలో ఈ బంగారం ఉందట. ఏ దేశానికైనా బంగారం అతిపెద్ద శక్తిగా పరిగణిస్తారు. ఒక దేశం ఎంత బంగారం కలిగి ఉంటే అంత శక్తివంతంగా ఉంటుంది. ఇప్పటికే చైనా- ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం సరఫరాదారు. నిజంగా ఇక్కడ అంచనాలకు అనుగుణంగా బంగారం లభిస్తే.. ప్రపంచ గోల్డ్ మార్కెట్‌ను డ్రాగన్ కంట్రీ శాసించడం ఖాయమని మార్కెట్ నిపుణుల అంచనా. ఈ బంగారు గని ఆ దేశ ఆర్థిక వృద్ధిని పెంచుతుందని అందరూ భావిస్తున్నారు. చైనాలో కనిపించిన ఈ బంగారాన్ని ఎప్పటి లోగా వెలికి తీస్తారో చెప్పలేదు. అయితే.. ఇది అంత ఈజీగా అయ్యే పని మాత్రం కాదు. 2 కిలోమీటర్ల లోతు నుంచి బంగారాన్ని పైకి తేవాలంటే.. సంవత్సరాలు పడుగుతుంది. పైగా భారీ ఖర్చుతో కూడుకున్న పని అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాటర్ బాటిల్‌తో ఇంత లైటింగ్ వస్తుందా.. ఐడియా అదుర్స్..!
మామిడి పండ్లను రాత్రిపూట తింటున్నారా.. జాగ్రత్త..!
ప్రపంచంలోనే అతి పెద్ద శ్మశానం.. పై నుంచి చూస్తే ఇదో పెద్ద నగరం!

ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో

పెళ్లి రోజు వధువు షాకింగ్ ట్విస్ట్.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు

కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్ వీడియో

బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్

హనీమూన్లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో

యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో

70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో
