మామిడి పండ్లను రాత్రిపూట తింటున్నారా.. జాగ్రత్త..!
పండ్లలో రారాజు మామిడి. దీనిని ఇష్టపడనివారంటూ ఉండరు. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు పండ్ల మార్కెట్‌లో అత్యధికంగా కనిపించే పండ్లు మామిడి. వేసవిలో వీటి రుచులు ఆస్వాధించకుండా దాదాపు ఎవరూ ఉండలేదు. ఇవి రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. మామిడి పండ్లలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి.
ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, సహజ చక్కెరలు ఇందులో అధిక మొత్తంలో ఉంటాయి. అయితే, మామిడి పండ్లు తినడానికి ఓ సమయం ఉంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇష్టమని ఎప్పుడంటే అప్పుడు తింటే ఆరోగ్యానికి హాని తప్పదంటున్నారు. సాధారణంగా మామిడి పండ్లు ఉదయం లేదా మధ్యాహ్నం తినడం ఆరోగ్యానికి మంచిది. అయితే, చాలా మంది రాత్రి భోజనంతో పాటు మామిడిపండును తింటారు. చాలా మంది జ్యూస్ చేసుకుని కూడా తాగుతారు. అయితే వైద్యుల అభిప్రాయం ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత అంటే సాయంత్రం లేదా రాత్రి సమయంలో మామిడి పండ్లు తినకపోవడమే మంచిది. ఇది తీవ్రమైన శారీరక సమస్యలను కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఉదయం లేదా మధ్యాహ్నం మామిడి పండ్లు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందంటున్నారు. రాత్రిపూట ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. అందుకే మామిడి వంటి పోషకాలు అధికంగా ఉండే పండ్లను తినకూడదు. దీనివల్ల అజీర్ణం, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. రాత్రిపూట మామిడి పండ్లు తినడం వల్ల బరువు పెరుగుతారు. ఎందుకంటే మామిడి పండ్లలో కేలరీలు, చక్కెర అధికంగా ఉంటాయి. రాత్రిపూట ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే, బరువు పెరిగే అవకాశం ఉంది. మామిడి తినడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. అందుకే శరీరం అలసిపోయినా నిద్రపోవాలనుకోదు. రాత్రిపూట మామిడిపండు తినడం వల్ల నిద్రలేమి సమస్యలు పెరుగుతాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రపంచంలోనే అతి పెద్ద శ్మశానం.. పై నుంచి చూస్తే ఇదో పెద్ద నగరం!
ఈ ఒక్కదానితో మసాజ్ చేస్తే.. చర్మం యవ్వనంగా మెరుస్తుంది
ఈ మొక్క సర్వరోగ నివారిణి..ఎక్కడ కనిపించినా వదిలిపెట్టకండి

ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో

పెళ్లి రోజు వధువు షాకింగ్ ట్విస్ట్.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు

కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్ వీడియో

బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్

హనీమూన్లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో

యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో

70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో
