Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరోగ్యానికి ఔషధ నిధి చెన్నంగి.. తింటే చెప్పలేనన్ని లాభాలు

ఆరోగ్యానికి ఔషధ నిధి చెన్నంగి.. తింటే చెప్పలేనన్ని లాభాలు

Phani CH

|

Updated on: Jun 08, 2025 | 12:09 PM

వర్షాకాలం అంటేనే సీజనల్‌ వ్యాధులు మొదలవుతాయి. వానలతో పాటుగానే ఈ సీజన్‌లో దోమలు, జ్వరాలు, జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు తరచూ వెంటాడుతుంటాయి. అయితే, ఇలాంటి సీజనల్‌ వ్యాధులకు చెక్‌ పెట్టేందుకు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధ మూలికా మొక్కలు అనేకం ఉన్నాయి. అందులో చెన్నంగి ఒకటి. దీనినే కసివింద అని అంటారు.

ఈ మొక్కలోని ప్రతి భాగం ఆరోగ్యానికి ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. చెన్నంగి.. దీన్నే కసివింద అని కూడా అంటారు..చెన్నంగి ఆకులతో పచ్చడి చేసుకుని తింటే.. జ్వరంతో నోటి రుచి కోల్పోయిన వారికి ఈ చట్నీ తిరిగి రుచి తెలిసేలా చేస్తుంది. ఎన్నో ఔష‌ధ‌ గుణాల‌ు క‌లిగిన చెన్నంగిలో చిన్న క‌సివింద‌, పెద్ద క‌సివింద అని రెండు ర‌కాల చెట్లు ఉంటాయి. దీనిని చిన్న చెన్నంగి, పెద్ద చెన్నంగి అని కూడా పిలుస్తారు. చిన్న చెన్నంగిని ఉప‌యోగించి క‌డుపులో ఉండే వ్యర్థాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌వ‌చ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. క‌సివింద చెట్టు ర‌సం చేదుగా ఉండి వేడిని క‌లిగిస్తుంది. ఇది శరీరంలోని వాతాన్ని, విషాన్ని హ‌రిస్తుంది. గాయాల‌ను, చ‌ర్మ రోగాల‌ను న‌యం చేయ‌డంలో ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. క‌సివింద చెట్టు ఆకుల‌ను వెన్నతో నూరి ప‌క్షవాతంతో చచ్చుబడిపోయిన భాగాల‌పైన ప్రతిరోజూ మ‌ర్దనా చేయ‌డం వ‌ల్ల అవి పూర్వ స్థితికి చేరుకుంటాయి. క‌సివింద ఆకుల‌ను, వేరు బెర‌డును ఎండ‌బెట్టి పొడిలా చేసుకుని తేనెను క‌లిపి లేప‌నంగా రాసుకోవ‌డం వ‌ల్ల అనేక ర‌కాల చ‌ర్మ వ్యాధులు, గాయాలు, వ్రణాలు త‌గ్గుతాయి. ఈ మొక్క పువ్వుల‌ను దంచి వ‌స్త్రంలో వేసి ర‌సాన్ని తీయాలి. ఈ ర‌సాన్ని ఒక‌టి లేదా రెండు చుక్కల ప‌రిమాణంలో కంటిలో వేసుకుంటూ ఉంటే ఏడు రోజుల్లో రేచీక‌టి త‌గ్గుతుంది. క‌సివింద గింజ‌ల‌ను దోర‌గా వేయించి పొడి చేసుకుని త‌గిన‌న్ని పాలు, కండ‌చ‌క్కెర క‌లిపి కాఫీలా తాగితే మూత్ర సంబంధిత రోగాలు త‌గ్గుతాయి. ర‌క్తం కూడా శుద్ధి అవుతుంది. శరీరానికి ఏదైనా గాయం అయినప్పుడు ఆగ‌కుండా రక్తం కారుతూ ఉంటే, ఈ చెట్టు ఆకులను దంచి క‌ట్టుగా క‌ట్టడం వ‌ల్ల ర‌క్తం కార‌డం త‌గ్గుతుంది. ఇలా క‌సివింద చెట్టుతో మ‌నం బోలెడు ప్రయోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. క‌నుక ఈ మొక్క ఎక్కడ క‌నిపించినా వ‌ద‌ల‌కుండా ఇంటికి తెచ్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీళ్లేం తల్లిదండ్రులు బాబోయ్.. స్కూల్లో పిల్లలముందే

పొట్ట నొప్పితో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. టెస్టులు చేసి వైద్యులే షాక్

రాంగ్‌రూట్‌లో దూసుకెళ్లిన పోలీసుల కారు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

మట్టి తవ్వుతుండగా ఏదో శబ్దం.. ఇంకాస్త లోతుగా తవ్వగా.. ఆశ్చర్యకరంగా

మృత్యుంజయులు.. వంతెనపైనుంచి 50 అడుగుల లోతులో పడిన కారు