మృత్యుంజయులు.. వంతెనపైనుంచి 50 అడుగుల లోతులో పడిన కారు
ఆవగింజంత ఆయుష్షు ఉన్నా వందేళ్లు బతికేయొచ్చనడానికి నిదర్శనం ఈ ఘటన.. ఖమ్మం జిల్లా వైరా వద్ద హైవే పై ఉన్న హై లెవెల్ బ్రిడ్జి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన డీసీఎం, కారు ను ఇనుప చువ్వలు లోడ్ తో వెళ్తున్న లారీ డీ కొట్టింది. దీంతో బ్రిడ్జి పై నుంచి 50 అడుగుల లోతులో ఉన్న నదిలోకిలారీ, కారు పడిపోయాయి.
కారుపైన పెద్ద సంఖ్యలో ఇనుప చువ్వలు గుట్టగా పడిపోయాయి.. కారులోని వారంతా బ్రితికి బట్టకట్టే ఛాన్స్ లేదని అందరూ అనుకున్నారు. కానీ స్వల్పగాయాలతో అంతా బయటపడ్డారు. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతా ప్రాణాలతో బయటపడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఖమ్మం జిల్లా వైరాకు సమీపంలోని హైలెవల్ వంతెన వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యుంజయులుగా బయటపడ్డారు. బ్రిడ్జి మీద నుంచి 50 అడుగుల లోతులో ఉన్న నదిలో కారు పడింది. ఆ తర్వాత దానిపై లారీలోని టన్నులకొద్దీ ఇనుప చువ్వలు పడ్డాయి.. దీంతో కారు నుజ్జునుజ్జయిపోయింది. కారులో ఒకే కుటుంబానికి ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. వారెవరికీ ఎలాంటి ప్రాణహానీ కలగలేదు. అందరూ గాయాలతో బయట పడ్డారు. వైరా నదిలోమునిసిపాలిటీ వారు పోసిన చెత్త ఈ ఐదుగురి ప్రాణాలను కాపాడింది. లారీలోని ఇనుప చువ్వలు కారుమీద పడిన సమయంలో కారు చెత్త కుప్పలో కూరుకుపోవడంతో దానిలో ఉన్న ఐదుగురు గాయాలతో బయటకొచ్చారు. ఘటనా స్థలం లో భయానక దృశ్యాలు కనిపించాయి..ఈ ప్రమాదం చూసిన వారు ఒక్కసారిగా భయ బ్రాంతులకు గురయ్యారు. అప్పటికే చిమ్మ చీకట్లు కమ్ముకోవడంతో అసలు ఏమి జరిగిందో తెలియక ఆందోళన చెందారు. ప్రమాదం జరిగిన తీరు చూస్తే కారులోనివారు కచ్చితంగా మృతిచెంది ఉంటారనుకుంటారు. కానీ వారు మృత్యుంజయులుగా బయట పడటం వారి అదృష్టమేనని అందరూ అనుకున్నారు. కారులో ఉన్న మొగిలిశెట్టి కోటేశ్వరరావుకు తీవ్రగాయాలు కాగా ఆయన కుమారుడు మొగిలిశెట్టి రాజశేఖర్, కోడలు గీత, మనవడు,మనుమరాలు తేజస్, జ్యోతి స్వల్పగాయాలతోబయటపడ్డారు. కోటేశ్వరరావును ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ప్రధాన హైవే కావడంతో కొన్ని కిలోమీటర్లు మేర..వాహనాలు నిలిచి పోయి..ట్రాఫిక్ జామ్ అయ్యింది..పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేసి..గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు..ఈ ప్రమాద ఘటన చూసి ఇది నిజమా..ఏదైనా సినిమాలో సన్నివేశమా..అని చర్చించి కుంటున్నారు..బ్రిడ్జి పై నుంచి నదిలో పడి..ప్రాణాలతో బయటకు రావడం చూస్తే నిజంగా అదృష్టవంతులు..మృత్యుంజయులే..అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిద్రపోదామని రూమ్‌లోకి వెళ్లిన వ్యక్తి.. దిండుకింద ఏదో కదలిక.. చూస్తే
చేపలు నడవడం చూసారా ?? అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే

విందులో మందు లేదని కుటుంబాన్ని వెలేసిన గ్రామస్తులు వీడియో

జగిత్యాలలో ఎల్లో ఫ్రాగ్స్ కలకలం దేనికి సంకేతమో తెలుసా?వీడియో

వీడు మామూలోడు కాదు.. ప్రియురాలి కోసం.. వీడియో

వామ్మో.. అంతటి జెర్రిపోతును అమాంతం మింగేసిందిగా వీడియో

ఓర్నీ.. వధువుకి పువ్వు ఇవ్వడానికి వరుడు పడిన కష్టం చూస్తే నవ్వడమే

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..
