Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీళ్లేం తల్లిదండ్రులు బాబోయ్.. స్కూల్లో పిల్లలముందే

వీళ్లేం తల్లిదండ్రులు బాబోయ్.. స్కూల్లో పిల్లలముందే

Phani CH

|

Updated on: Jun 07, 2025 | 1:13 PM

 ఈ గొడవను చూసి చిన్నారులు తీవ్ర భయాందోళనలకు గురై, కన్నీరు పెట్టుకుంటూ గొడవను ఆపాలని తల్లిదండ్రులను వేడుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మే 28న అర్కాన్సాస్‌లోని వెస్ట్ మెంఫిస్‌లోని ఫాల్క్ ఎలిమెంటరీ స్కూల్‌లో కిండర్ గార్డెన్ స్నాతకోత్సవం సందర్భంగా గందరగోళం చెలరేగింది.

ఈ వేడుకకు హాజరైన తల్లిదండ్రల మధ్య గొడవ చెలరేగింది. అది కాస్త చినికి చినికి గాలివానగా మారింది. మహిళల మధ్య చెలరేగిన వాగ్వాదం కొన్ని క్షణాల్లోనే అక్కడ యుద్ధవాతావరణాన్ని సృష్టించాయి. కొందరు మగవారు గొడవను అడ్డుకుందామని ప్రయత్నించి..విఫలమయ్యారు. మరికొందరు మాత్రం పరిస్థితి చేజారేలా ఉందని గ్రహించి వెంటనే అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిసింది. అయితే, ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ అవాంఛనీయ ఘటనను సదరు పాఠశాల యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఇటువంటి ప్రవర్తన ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఈ గొడవకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. విద్యార్థులు, సిబ్బంది భద్రత, పాఠశాల ప్రాంగణ రక్షణకే మా మొదటి ప్రాధాన్యం అని, ఈ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తునకు మేం పూర్తిగా సహకరిస్తాం అని పాఠశాల యాజమాన్యం ఓ అధికారిక ప్రకటనలో పేర్కొంది. కాగా నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పొట్ట నొప్పితో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. టెస్టులు చేసి వైద్యులే షాక్

రాంగ్‌రూట్‌లో దూసుకెళ్లిన పోలీసుల కారు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

మట్టి తవ్వుతుండగా ఏదో శబ్దం.. ఇంకాస్త లోతుగా తవ్వగా.. ఆశ్చర్యకరంగా

మృత్యుంజయులు.. వంతెనపైనుంచి 50 అడుగుల లోతులో పడిన కారు

నిద్రపోదామని రూమ్‌లోకి వెళ్లిన వ్యక్తి.. దిండుకింద ఏదో కదలిక.. చూస్తే