పొట్ట నొప్పితో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. టెస్టులు చేసి వైద్యులే షాక్
ఒడిశాలోని నయాగఢ్ జిల్లాకు చెందిన 50 ఏళ్ల వ్యక్తి ఓ జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి కారణంగా అతని కుడి కిడ్నీలో పెద్ద ఎత్తున కణితులు ఏర్పడి, వాటి మొత్తం బరువు 8.7 కిలోల వరకు పెరిగింది. ఇది దేశంలోనే అతిపెద్ద కిడ్నీ కణితిగా వైద్య చరిత్రలో నమోదు అయ్యింది.ఈ భారీ కణితి వల్ల రోగి తీవ్ర స్థాయిలో పొట్ట నొప్పి, శ్వాసలో ఇబ్బంది, నిద్రలేమి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు.
ఈ పరిస్థితిలో, ఏఐఐఎంఎస్ భువనేశ్వర్ వైద్యుల బృందం క్షుణ్ణంగా పరీక్షించి, ఐదుగంటలపాటు శ్రమించి క్లిష్టమైన శస్త్రచికిత్స ద్వారా కణితిని తొలగించారు. డాక్టర్ మనోజ్ కుమార్ దాస్ నేతృత్వంలో వైద్యుల బృందం ఈ క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ సందర్భంగా డాక్టర్ దాస్ మాట్లాడుతూ, ” నమ్మకం, టీమ్ కోఆర్డినేషన్ కారణంగానే ఇది సాధ్యమైందని తెలిపారు. ఏఐఐఎంఎస్ భువనేశ్వర్ కార్యనిర్వాహక డైరెక్టర్ డాక్టర్ అశుతోష్ బిశ్వాస్, ఉరాలజీ విభాగాధిపతి డాక్టర్ ప్రశాంత్ నాయక్ అందించిన ప్రోత్సాహం కీలకమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం స్థిరంగా ఉందని, శస్త్రచికిత్స అనంతరం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని తెలిపారు. వైద్య బృందం అతనిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఇంత భారీ కిడ్నీ కణితిని తొలగించడం వైద్య చరిత్రలో అరుదైన ఘట్టంగా చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాంగ్‌రూట్‌లో దూసుకెళ్లిన పోలీసుల కారు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు
మట్టి తవ్వుతుండగా ఏదో శబ్దం.. ఇంకాస్త లోతుగా తవ్వగా.. ఆశ్చర్యకరంగా
మృత్యుంజయులు.. వంతెనపైనుంచి 50 అడుగుల లోతులో పడిన కారు
నిద్రపోదామని రూమ్‌లోకి వెళ్లిన వ్యక్తి.. దిండుకింద ఏదో కదలిక.. చూస్తే

బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్

హనీమూన్లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో

యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో

70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో
