Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటిబయట బట్టలు ఆరేస్తున్నారా.. జాగ్రత్త

ఇంటిబయట బట్టలు ఆరేస్తున్నారా.. జాగ్రత్త

Phani CH

|

Updated on: Jun 08, 2025 | 1:12 PM

ఆరుబయట ఆరబెట్టిన బట్టలే ఇతగాడి టార్గెట్. బట్టలు బయట తాడు మీద ఆరేసి లోపలికి వెళ్లి మళ్ళీ వచ్చి చూసేసరికి బట్టలు మాయమైపోతున్నాయి. ఇది స్థానికులను ఆలోచనలో పడేసింది. ఈ ఘటన కమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. కమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని ఒక ఇంట్లోని వారు బట్టలు ఉతికి ఆరుబయట ఆరేశారు. ఆ తర్వాత ఇంట్లో పనుల్లో మునిగిపోయారు.

ఈ క్రమంలో ఒక దొంగ పట్టపగలే ఆ ఇంటి ఆవరణలోకి ప్రవేశించాడు. మొదట ఇంట్లోకి చొరబడదామనుకున్న అతనికి పట్టుబడితే జైలుకు వెళ్ళాలని భయపడి ఒట్టిగా తిరిగి వెళ్ళలేక ఆ ఇంటి ఆవరణలో తాడు మీద ఆరేసిన బట్టలు సంచిలో సర్దుకుని అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ చోరీ తతంగాన్ని ఎదురుగా ఉన్న ఒక షాపులోని సీసీ కెమెరాలలో రికార్డ్ అయింది. ఆ వీడియో ఫుటేజ్ చూసిన స్థానికులు బాధిత కుటుంబం వారు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో క్లిప్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో చూసిన కొందరు ఉతికిన బట్టలు ఎండేవరకు కాపలా కావాలేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బయటపడ్డ వెయ్యి టన్నుల బంగారం కొండ.. లెక్క చూస్తే..

వాటర్ బాటిల్‌తో ఇంత లైటింగ్ వస్తుందా.. ఐడియా అదుర్స్‌..!

మామిడి పండ్లను రాత్రిపూట తింటున్నారా.. జాగ్రత్త..!

ప్రపంచంలోనే అతి పెద్ద శ్మశానం.. పై నుంచి చూస్తే ఇదో పెద్ద నగరం!

ఈ ఒక్కదానితో మసాజ్‌ చేస్తే.. చర్మం యవ్వనంగా మెరుస్తుంది