Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లాడితో కలిసి ఫుట్‌బాల్‌ ఆడిన కాకి.. వీడియో వైరల్

పిల్లాడితో కలిసి ఫుట్‌బాల్‌ ఆడిన కాకి.. వీడియో వైరల్

Phani CH

|

Updated on: Jun 09, 2025 | 3:22 PM

లోకులు పలు కాకులు అనే సామెత తెలిసిందే. ఆ సామెత ఎలా ఉన్నా ఓ కాకి ఫుట్‌బాల్‌ ఆడి అద్భుతం చేసి చూపించింది. మనం సాధారణంగా కావ్‌ కావ్‌ మంటూ చెవులు చిల్లులు పడేలా అరిచే నల్ల కాకులనే చూస్తాం. కానీ కాకుల్లో ఫుట్ బాల్‌ ఆడే కాకులు ఉన్నాయని ఇంతకు ముందు తమకు తెలియదంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

కాకులకు 7 నుంచి 10 సంవత్సరాల పిల్లలకు ఉండే తెలివి తేటలు ఉంటాయట. ఇవి మనుషుల ముఖాల్ని గుర్తు పెట్టుకోగలవనీ తమకు హాని కలిగించిన వ్యక్తుల ముఖాల్ని గుర్తు పెట్టుకుని మరీ పగ తీర్చుకోగలవని సైంటిస్టుల పరిశోధనల్లో తేల్చారు. ఇంత తెలివైన కాకులు ఫుట్‌బాల్ ఆట ఆడటం అన్నది పెద్ద విషయమేమీ కాదు. తాజాగా, ఓ కాకి.. పిల్లాడితో కలిసి ఫుట్‌బాల్ ఆట ఆడింది. ఫుట్‌బాల్ అంటే నిజమైన ఫుట్‌బాల్ కాదు. ఓ చిన్న మెత్తటి బాల్‌తో అది ఫుట్‌బాల్ ఆట ఆడింది. ఆ బాలును పిల్లాడు కాలుతో కాకి వైపు కొడుతూ ఉంటే.. ఆ కాకి తన ముక్కుతో బాలును బాలుడివైపు కొడుతూ ఉంది. ఇలా చాలా సార్లు బాల్‌ను బాలుడి వైపు ముక్కుతో కొట్టింది. ఇద్దరు మనుషులు కాళ్లతో ఫుట్‌బాల్ ఆడితే ఎలా ఉంటుందో .. అలా బాలుడు, కాకి కలిసి ఫుట్‌బాల్ ఆడారు. బాలుడు ఆ బాలును కాలితో తంతే.. కాకి తన ముక్కుతో కొట్టింది. అంతే తేడా. ఈ సంఘటన ఇండియాలోని దక్షిణ గోవాలో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ రొనాల్డో కాదు.. క్రొనాల్డో’.. చాలా మంది ఫుట్‌బాల్ ప్లేయర్ల కంటే ఆ కాకి చాలా అద్భుతంగా ఆడుతోందని కొందరు ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు అలాగే‘ నువ్వు సండే ఫ్రీగా ఉంటావా.. మాకు ఓ ఆటగాడి అవసరం ఉందని కొందరు.. కాకి ఫుట్‌బాల్ ఆడుతూ ఉంటే చాలా క్యూట్‌గా ఉందంటూ.. మరికొందరు కామెంట్స్‌ పెట్టారు. ఇంకొందరైతే ‘ ఆ బ్రో.. గత జన్మలో ఫుట్‌బాల్ ప్లేయర్ అయి ఉంటాడని.. పీలె మళ్లీ పుట్టాడు అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

103 ఏళ్ల బామ్మ మేకప్‌ పాఠాలు.. ఫిదా అవుతున్న యూత్

లాటరీలో వచ్చిన రూ.30 కోట్లు ప్రియురాలి అకౌంట్లో వేశాడు.. మరుక్షణం ఆమె

ఈ యువకుడి ఐడియాను మెచ్చుకోకుండా ఉండలేరు..

పాములను పట్టి అడవిలో వదులుదామని వెళ్లిన స్నేక్‌ క్యాచర్‌కు ఊహించని షాక్‌

బ్యాగుల్లో అరుదైన పాములు.. ఎయిర్‌ పోర్ట్‌ లో ల్యాండ్‌ అవగానే