Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింహంతో పరాచకాలాడితే ఇలాగే మడతెట్టేస్తది.. వీడియో వైరల్

సింహంతో పరాచకాలాడితే ఇలాగే మడతెట్టేస్తది.. వీడియో వైరల్

Phani CH

|

Updated on: Jun 09, 2025 | 4:21 PM

సింహం అంటే అడవికి రారాజు... సింహ గర్జన వింటే చాలు ఎంతటి క్రూరమృగాలైనా వణకాల్సిందే. అలాంటి సింహంతో ఓ వ్యక్తి ఆటపట్టించాలని చూసాడు. అంతే ఒక్క ఉదుటన అతని మీదకు దూసుకొచ్చింది సింహం. అతను తృటిలో తప్పించుకున్నాడు కానీ.. లేకపోతే ఆరోజు సింహానికి ఆహారమైపోయేవాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వీడియో చూసిన నెటిజన్లు సింహంతో పరాచకాలాడితే ఇలాగే ఉంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. సింహం బోనులో ఉన్నా సరే దానితో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. దానికి కోపం వస్తే పరిస్థితి ఊహించని విధంగా ఉంటుంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి బోనులో ఉన్న సింహానికి ఆహారం పెడుతూ దానిని టీజ్ చేయడానికి ప్రయత్నించాడు. బోను తలుపు తెరిచి సింహం ముందుకు మాంసం ముక్కలను విసిరాడు. ఆ తర్వాత తన చేతితో చిటికెలు వేస్తూ సింహాన్ని టీజ్ చేయడానికి ప్రయత్నించాడు. అంతే… ఆ సింహానికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. రోజూ ఒకటేరకం మాంసం పెడుతూ బోరు కొట్టించేది కాకుండా.. నాతోనే పరాచకాలాడతావా… ముందు నిన్ను భుజించేస్తే పీడ వదిలిపోతుంది.. అన్నట్టుగా కోపంతో గర్జిస్తూ అతనిమీదకు దూకింది. అలర్టయిన ఆ వ్యక్తి క్షణాల్లో బోను తలుపు మూసివేశాడు. దీంతో ఆ సింహం బోను లోపలి నుంచి మరింత కోపంగా గర్జిస్తూ అతన్ని భయపెట్టింది. దాంతో భయపడిన అతను ఓర్నాయనో..ఇంక ఇక్కడుండటం మంచిదికాదు అన్నట్టుగా అక్కడినుంచి జారుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియోను లక్షలమంది వీక్షించారు. వేలాదిమంది లైక్‌ చేశారు. వీడియోపై నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ముక్క లేనిదే ముద్ద దిగదు.. మాంసాహారంలో తెలంగాణ టాప్‌

పాములా ప్రవర్తిస్తూ యువతి వింత చేష్టలు.. ఆ గ్రామంలో వింత ఘటన!

ఆయుష్షు గట్టిది అంటే ఇదే.. పెను ప్రమాదంలో కూడా

పిల్లాడితో కలిసి ఫుట్‌బాల్‌ ఆడిన కాకి.. వీడియో వైరల్

103 ఏళ్ల బామ్మ మేకప్‌ పాఠాలు.. ఫిదా అవుతున్న యూత్