Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జనవాసాల్లోకి మొసలి.. భయంతో జనం పరుగులు వీడియో

జనవాసాల్లోకి మొసలి.. భయంతో జనం పరుగులు వీడియో

Samatha J

|

Updated on: Jun 10, 2025 | 2:03 PM

గద్వాల్ పట్టణంలో హమాలీ కాలనీవాసులను ఒక భారీ మొసలి హడలెత్తించింది. సోమవారం అర్ధరాత్రి ఇళ్ళ మధ్యకు వచ్చిన మొసలిని చూసి కుక్కలు గట్టిగా మొరుగుటతో ఏమై ఉంటుందా అని చూసిన స్థానికులు మొసలిని చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అందరూ కలిసి మొసలిని తాడుతో బంధించి అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దాంతో అటవీశాఖ సిబ్బంది స్థానిక జంతు సంరక్షణ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. చాకచక్యంగా వ్యవహరించి మొసలికి ఎలాంటి హాని కలగకుండా ప్రజలకు ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా సురక్షితంగా పట్టుకున్నారు.

అనంతరం ఆ మొసలిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. హమాలీ కాలనీకి సమీపంలో జూరాల ప్రాజెక్టు కుడి కాలువ ఉందని అక్కడి నుంచే మొసలి వచ్చి ఉండొచ్చని కాలనీవాసులు తెలిపారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో మొసళ్ల సంచారం పెరిగినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా భారీ వర్షాలు కురిసినప్పుడు వరదలు సంభవించినప్పుడు అవి తమ సహజ ఆవాసాల నుంచి బయటికి వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. నదుల్లో నీటి మట్టాలు పెరగడం లేదా ఆహార వనరులు తగ్గటం వంటి కారణాల వల్ల మొసళ్లు తమ ఆవాసాలను వదిలి బయటికి వస్తుంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు మొసళ్లు ఎక్కువగా సంచరించే ప్రాంతాలపై నిఘా పెంచారు.

మరిన్ని వీడియోల కోసం :

“మూగ మనసులు’ సినిమాలో ..సావిత్రి నివాసం ఉన్న భవనం ఇదే వీడియో

ఫస్ట్‌నైట్ రోజున షాకింగ్ సీన్.. నవవధువు చేసిన పనికి వరుడు వీడియో

బీఎండబ్ల్యూ కాదు.. స్విఫ్ట్ కొనిస్తా’ తండ్రి చెప్పిన ఈ ఒక్క మాటతో.. కాసేపటికే వీడియో

Published on: Jun 10, 2025 02:03 PM