“మూగ మనసులు’ సినిమాలో ..సావిత్రి నివాసం ఉన్న భవనం ఇదే వీడియో
గోదావరి తీరంలో సినిమా లోకేషన్స్ చాలానే ఉన్నాయి. అయితే తెలుగు సినిమాని ఎక్కువ భాగం అవుట్ డోర్ లో తీసిన మొదటి సినిమా మూగ మనసులు. ఈ సినిమాలో చాలా భాగం నర్సాపురంలో వలందర రేవుతో పాటు ఆ రేవుకు ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో జరిగింది. సినిమాలో సావిత్రి నివసించిన పెద్ద భవనం ఇది. అప్పట్లో హోటల్స్, లాడ్జిల సదుపాయం లేకపోవడంతో సినిమా యూనిట్ సభ్యులంతా స్థానికంగా పరిచయం ఉన్నవారి ఇళ్లలోనే ఉండేవారట.
1964లో తీసిన ఈ సినిమాలో హీరోగా అక్కినేని నాగేశ్వరరావు, హీరోయిన్ లుగా సావిత్రి, జమున నటించారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ చిత్రం తర్వాత కోనసీమ, గోదావరి ప్రాంతాల్లో అవుట్ డోర్ షూటింగ్స్ ఎక్కువగా మొదలయ్యాయి. మద్రాసులోని స్టూడియోలకే పరిమితమైన చిత్ర నిర్మాణాలు ఒక విధంగా మూగమనసులు మూవీ తోనే అవుట్ డోర్ లోకేషన్స్ కు మారాయి. మూగమనసులు సినిమా హిందీలో మిలన్ గా తీశారు. ఈ సినిమాలో హీరో సునీల్ దత్. ఆయన కూడా అప్పట్లో నర్సాపురం వచ్చినట్లు నాటి జ్ఞాపకాలను స్థానికులు ఇప్పటికీ నెమరవేసుకుంటారు. వలందర రేవులోనే మూగమనసులు సినిమాలో నాగేశ్వరరావు పాడవ నడిపిన సన్నివేశాలు తీశారట. ప్రస్తుతం రేవులో పెద్ద ఆర్చ్ నిర్మాణం జరిగింది. దానికి ఎదురుగా ఉన్న టెంపుల్ సినిమాలో కనిపిస్తుంది. ఆ పక్కనే ఉన్న భవనాన్ని 1920లో డచ్ వాళ్లు నిర్మించారు. ఇప్పటికీ ఈ భవనం అలాగే చెక్కుచెదరకుండా ఉంది.
మరిన్ని వీడియోల కోసం :
బస్సు వెనుక సీటులో ప్రేమ జంట పిచ్చి పనులు వీడియో
మస్క్ కంటి కింద నల్లటి గాయం ఎవరు కొట్టారు? ఏం జరిగింది? వీడియో
ఇద్దరికీ పెళ్లయింది.. ఫేస్‌బుక్ పరిచయంతో వివాహేతర సంబంధం.. చివరకు వీడియో
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

