మస్క్ కంటి కింద నల్లటి గాయం ఎవరు కొట్టారు? ఏం జరిగింది? వీడియో
అమెరికా అధ్యక్ష సలహాదార పదవి నుంచి వైదొలుగుతున్న ఎలాన్ మస్క్ కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీడ్కోలు పలికారు. వీడ్కోలు వేళ మస్క్ నుదుటి కంటి వద్ద ఉన్న గాయంపై చర్చ జరిగింది. ట్రంప్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ సారధిగా ఎలాన్ మస్క్ సేవలు అందించారు. మే 30న తన పదవికి చివరి రోజు కావడంతో అధ్యక్షుడు ట్రంప్ కార్యాలయానికి మస్క్ వెళ్లారు. ఈ సందర్భంగా ఘనంగా వీడ్కోలు పలికారు. అయితే ఈ కార్యక్రమంలో మస్క్ ముఖంపై ఉన్న గాయం చర్చకు వచ్చింది. దీనిపై అక్కడున్న వారు మస్క్ ను ప్రశ్నించారు.
మస్క్ స్పందిస్తూ ఈ గాయం తన కుమారుడు చేసిందని, తను తన ఐదేళ్ల కుమారుడు బీచ్ లో గుర్రపు స్వారీ చేస్తున్నప్పుడు పిల్లలు తన ముఖంపై ఒక పంచ్ ఇచ్చాడని తెలిపారు. దీంతో అక్కడ గాయం ఏర్పడిందని, ఆ సమయంలో దీన్ని తాను పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇలా మారిందని చెప్పుకొచ్చారు. ఐదేళ్ల కుమారుడు కొడితే ఇంతలా గాయమైందా అని అక్కడున్న వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ట్రంప్ స్పందిస్తూ మస్క్ కుమారుడు అలా చేయగలడని అన్నారు. ఎలాన్ మస్క్ కొన్ని రకాల డ్రగ్స్ వాడుతున్నారంటూ ఓ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా వాటిని వినియోగించారా అని మస్క్ ను విలేకరి ప్రశ్నించారు. అందుకు మస్క్ స్పందిస్తూ అది తప్పుడు కథనమంటూ సమాధానం ఇచ్చారు. అయినప్పటికీ మస్క్ ముఖంపై గాయం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏం జరిగిందనే చర్చ నడుస్తోంది.
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

