ఇద్దరికీ పెళ్లయింది.. ఫేస్‌బుక్ పరిచయంతో వివాహేతర సంబంధం.. చివరకు వీడియో
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా కారణంగా అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. Instagram, Facebook, Twitter వంటి సోషల్ మీడియా సైట్లలో సరదా పరిచయాలు వివాహేతర సంబంధాల వరకు దారితీస్తున్నాయి. దీంతో ఇరు కుటుంబాలు రోడ్డుపాలు అవుతున్నాయి. అలాంటి సంఘటనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇద్దరు వివాహితులే. కానీ వారిని కలిపింది Facebook. ఆ పరిచయం ప్రేమగా మారి అక్రమ సంబంధానికి దారితీసింది. అడ్డంగా బుక్ అయ్యి స్థానికులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. దీంతో ఆ దంపతులను కట్టేసి కొట్టారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని అశోక్ నగర్ కు చెందిన ఓ వివాహితకు ఇద్దరు పిల్లలు. అయితే భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన స్వామికి ఆ వివాహితుడితో కొన్ని రోజుల క్రితం Facebook పరిచయం ఏర్పడింది. ఈ ఇద్దరూ ప్రతిరోజు చాటింగ్ చేసుకునేవారు. ఈ చాటింగ్ కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత వివాహేతర సంబంధానికి దారితీసింది. రెగ్యులర్ గా సుల్తానాబాద్ కు వచ్చిపోతున్నాడు స్వామి. అయితే ఇద్దరి తతంగాన్ని గమనించిన స్థానికులు వారిపై నిఘా పెట్టారు. ఇద్దరు ఇంట్లో కలిసి ఉండగా పట్టుకున్నారు. కాలనీవాసులంతా కలిసి బోరింగ్ కు తాడుతో కట్టివేశారు. వివాహేతర సంబంధాలు పెట్టుకోవద్దని ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడికి మరోసారి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారికి కౌన్సిలింగ్ చేశారు. మరోసారి ఆమె ఇంటికి వస్తే కేసు బుక్ చేస్తామని పోలీసులు హెచ్చరించి పంపించారు.
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

