Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆన్‌లైన్‌లో చెప్పులు ఆర్డర్‌ పెట్టాడు.. వచ్చిన పార్సిల్‌ విప్పిచూడగా వీడియో

ఆన్‌లైన్‌లో చెప్పులు ఆర్డర్‌ పెట్టాడు.. వచ్చిన పార్సిల్‌ విప్పిచూడగా వీడియో

Samatha J

|

Updated on: Jun 10, 2025 | 1:20 PM

టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతుందో మోసాలు కూడా అంతే రేంజ్ లో జరుగుతున్నాయి. ప్రస్తుత కాలంలో ఏది కొనాలన్నా ఆన్ లైన్ లోనే. ఒక్క క్లిక్ తో కావాల్సిన సామానులు కాలి దగ్గరికి వస్తున్నాయి. కొంతవరకు ఇది వినియోగదారులకు ఉపయోగకరమే అయినా ఈ ఆన్ లైన్ షాపింగ్ తో కొందరు దారుణంగా మోసపోతున్నారు. సైబర్ నేరగాలు అమాయక ప్రజలను అడ్డగా మార్చుకొని మోసాలకు పాల్పడుతున్నారు.

ఆన్ లైన్ లో కాస్ట్లీ వస్తువులు కొనుగోలు చేసినప్పుడు అవి ఇంటికి డెలివరీ కాకపోవడం లేదా వాటి స్థానంలో మరొకటి పార్సిల్ లో ఉండటం లాంటి ఘటనలు తరచు చూస్తున్నాం. అలాంటి సంఘటనే ఒకటి ఖమ్మం జిల్లా వ్యక్తికి ఎదురైంది. అతను ఆన్ లైన్ లో కొత్త చెప్పులు ఆర్డర్ పెట్టాడు. కానీ పార్సిల్ లో వచ్చిన దానిని చూసి లబోదిబోమన్నాడు. ఖమ్మం జిల్లా బోధులబండికి చెందిన కాకాని సీతారాం చౌదరి ఇటీవల ఓ ఆన్ లైన్ యాప్ లో మోచి మ్యాన్ లెదర్ కంఫర్ట్ శాండల్స్ బుక్ చేశాడు. ఆర్డర్ చేసిన సమయంలోనే 3999 రూపాయలను యాప్ లో ముందస్తు చెల్లింపు చేశారు. సోమవారం వచ్చిన పార్సిల్ తెరిచి చూడగా అందులో మురికి చెప్పు ఒకటి దర్శనం ఇవ్వటంతో కంగుతిన్నాడు. కొరిదైన మోచి బ్రాండ్ చెప్పులను బుక్ చేస్తే వాడేసిన పాత చెప్పులతో డెలివరీ కావడంతో అతడు ఒక్కసారిగా షాక్ తిన్నాడు. వెంటనే యాప్ నిర్వాహకులకు ఫిర్యాదు చేశాడు. దాంతో వారు కంప్లైంట్ రాసుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

“మూగ మనసులు’ సినిమాలో ..సావిత్రి నివాసం ఉన్న భవనం ఇదే వీడియో

ఫస్ట్‌నైట్ రోజున షాకింగ్ సీన్.. నవవధువు చేసిన పనికి వరుడు వీడియో

బీఎండబ్ల్యూ కాదు.. స్విఫ్ట్ కొనిస్తా’ తండ్రి చెప్పిన ఈ ఒక్క మాటతో.. కాసేపటికే వీడియో