తల్లి దండ్రులను చంపి.. శవాలతో నాలుగేళ్ళుగా సహజీవనం వీడియో
డబ్బు కోసం తల్లిదండ్రులను చంపేందుకు కూడా వెనుకాడటం లేదు నేటి పిల్లలు అందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది బ్రిటన్ లో జరిగిన ఒక దారుణ సంఘటన. లండన్ కు చెందిన వర్జీనియా మెక్కల్లు డబ్బు కోసం తన తల్లిదండ్రులను దారుణంగా హత్య చేసింది. అంతేకాదు వారి మృతదేహాలను నాలుగు సంవత్సరాలు ఇంట్లోనే దాచి పెట్టింది. 36 ఏళ్ల వర్జీనియా జూన్ 2019లో తన తల్లి లూయిస్ తండ్రి జాన్ మెక్కల్లులను దారుణంగా హత్య చేసింది.
వీరిద్దరికీ దాదాపు 70 సంవత్సరాలు. అయితే తాను చేసిన అప్పులు క్రెడిట్ కార్డుతో చేసిన మోసం బయటపడితే తల్లిదండ్రులు తిడతారనే భయంతో చంపేశానని చెబుతోంది హంతకురాలు. కరోనా లాక్ డౌన్ సాకుతో తన తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవడం పెన్షన్ తీసుకునే ప్రక్రియను కొనసాగించింది. రెండు మృతదేహాలను ఇంట్లోనే దాచిపెట్టి ఆమె తన తల్లిదండ్రుల పేరుతో నాలుగు సంవత్సరాలుగా మెసేజ్ లు పంపుతూనే ఉంది. వారిద్దరూ పర్యటనలో ఉన్నారని అక్కను బంధువులను తప్పుదారి పట్టించింది. ఎట్టకేలకు నిజం బయటపడటంతో హంతకురాలికి వర్జీనియా కోర్టు 36 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే తన తల్లిదండ్రులను చంపిందనే షాక్ నుంచి అక్క చాలా రోజుల వరకు కోలుకోలేకపోయింది.
మరిన్ని వీడియోల కోసం :
“మూగ మనసులు’ సినిమాలో ..సావిత్రి నివాసం ఉన్న భవనం ఇదే వీడియో
ఫస్ట్‌నైట్ రోజున షాకింగ్ సీన్.. నవవధువు చేసిన పనికి వరుడు వీడియో
బీఎండబ్ల్యూ కాదు.. స్విఫ్ట్ కొనిస్తా’ తండ్రి చెప్పిన ఈ ఒక్క మాటతో.. కాసేపటికే వీడియో
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

