Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీఎండబ్ల్యూ కాదు.. స్విఫ్ట్ కొనిస్తా’ తండ్రి చెప్పిన ఈ ఒక్క మాటతో.. కాసేపటికే వీడియో

బీఎండబ్ల్యూ కాదు.. స్విఫ్ట్ కొనిస్తా’ తండ్రి చెప్పిన ఈ ఒక్క మాటతో.. కాసేపటికే వీడియో

Samatha J

|

Updated on: Jun 09, 2025 | 6:29 AM

కొందరు యువత అత్యాశకుపోయి గొంతెమ్మ కోరికలు కోరి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తుంటారు. చివరికి ఆ కోరికలు నెరవేరకపోవడంతో ప్రాణాలను తీసుకుంటున్నారు. ఎంతో విలువైన జీవితాన్ని కోల్పోవడమే కాకుండా కన్నవారికి తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. ఓ యువకుడు తల్లిదండ్రులు బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదని మనస్తాపంతో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగదేవ్ పూర్ మండలం చాటలపల్లి గ్రామానికి చెందిన బొమ్మ కనకయ్య కుమారుడు జానీ తనకు బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదని ఇంట్లో వారిని ఇబ్బందులు పెట్టాడు. కొనివ్వకపోతే చనిపోతాను అని తరచూ ఇంట్లోనే వారితో గొడవపడేవాడు. ఆర్థిక పరిస్థితి బాగోలేదని కుటుంబ సభ్యులు ఎంత నచ్చ చెప్పినా కారు కొనివ్వలసిందేనని ముందుకేశాడు. కొడుకు ముందు తనని భరించలేని తండ్రి లోన్ తీసుకొని శుక్రవారం సిద్ధిపేట కార్ షోరూమ్ కి వెళ్లి మారుతి స్విఫ్ట్ డిజైర్ కొనిస్తామని చెప్పాడు. అందుకు జానీ ఆ కారు నచ్చలేదని తనకు నచ్చిన బీఎండబ్ల్యూ కారునే కొనివ్వాలని డిమాండ్ చేశాడు. ఇక బీఎండబ్ల్యూ కారు కొనివ్వడం తమవల్ల కాదని తల్లిదండ్రులు చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు జానీ. శుక్రవారం సాయంత్రం తన వ్యవసాయ పొలం వద్ద క్రిమిసంహారక మందు తాగాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా శనివారం రాత్రి పరిస్థితి విషమించి జానీ మృతి చెందాడు.

మరిన్ని వీడియోల కోసం :

బస్సు వెనుక సీటులో ప్రేమ జంట పిచ్చి పనులు వీడియో

మస్క్‌ కంటి కింద నల్లటి గాయం ఎవరు కొట్టారు? ఏం జరిగింది? వీడియో

ఇద్దరికీ పెళ్లయింది.. ఫేస్‌బుక్‌ పరిచయంతో వివాహేతర సంబంధం.. చివరకు వీడియో

Published on: Jun 09, 2025 06:28 AM