ఓ తండ్రి కష్టం చూడలేక.. కొడుకు స్మార్ట్ ఆలోచన ఏం చేశాడంటే?
ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఒక రైతు వినూత్న ప్రయత్నం ఫలించింది. వాల్మీకిపురం మండలం ఎగువ బూడిదమేడు గ్రామానికి చెందిన రైతు వెంకట రమణారెడ్డికి ఐదున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆరుగాలం కష్టపడి సాగు చేస్తున్న రైతు వెంకట రమణారెడ్డికి దొంగల బెడద పెద్ద సమస్యగా మారింది. పొలంలో తరచు చోరీలు జరుగుతుండడం పెద్ద కష్టంగా మారిపోయింది.
రెండుసార్లు స్టార్టర్లు ఎత్తుకెళ్ళిన దొంగలు ఒకసారి ఏకంగా ట్రాన్స్ఫార్మర్ ని కొట్టేశారు. పొలంలో సాగు చేసిన పంట చేతికొచ్చిన సమయంలో విద్యుత్ పరికరాల చోరీ రైతుకు పెద్ద నష్టాన్నే మిగిల్చింది. చివరికి పశుగ్రాసం సాగు చేసిన దొంగల బెడద మాత్రం తప్పలేదు. రాత్రివేళల్లో పొలంలో చోరబడి పశుగ్రాసం కోసుకెళ్తున్న దొంగలు రైతు వెంకట రమణారెడ్డి కంటి మీద కునుకు లేకుండా చేశారు. హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న కొడుకు శ్రీకాంత్ రెడ్డితో తండ్రి వెంకట రమణారెడ్డి కష్టాన్ని చెప్పుకున్నాడు. దీంతో తండ్రి కష్టం దొంగల పాలు అవుతుండడంతో కొడుకు శ్రీకాంత్ రెడ్డికి కొత్త ఐడియా వచ్చింది. పొలానికి సీసీ కెమెరాలు దన్నుగా నిలుస్తాయని భావించిన శ్రీకాంత్ రెడ్డి తండ్రి కష్టానికి పరిష్కారం ఆలోచించాడు. అందులో భాగంగానే పొలానికి సోలార్ సీసీ కెమెరాలు సైరన్ తో నిరంతరం నిఘాతో పంటలను కాపాడుకునే ప్రయత్నం చేశాడు
మరిన్ని వీడియోల కోసం :
బస్సు వెనుక సీటులో ప్రేమ జంట పిచ్చి పనులు వీడియో
మస్క్ కంటి కింద నల్లటి గాయం ఎవరు కొట్టారు? ఏం జరిగింది? వీడియో
ఇద్దరికీ పెళ్లయింది.. ఫేస్‌బుక్ పరిచయంతో వివాహేతర సంబంధం.. చివరకు వీడియో
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

