Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేపలు ఇష్టంగా తింటున్నారా? ఈ విషయం తెలిస్తే మీ మైండ్ బ్లాంకే వీడియో

చేపలు ఇష్టంగా తింటున్నారా? ఈ విషయం తెలిస్తే మీ మైండ్ బ్లాంకే వీడియో

Samatha J

|

Updated on: Jun 09, 2025 | 6:28 AM

మీరు చేపలు తినటం అంటే ఇష్టమా? వారంలో రెండు మూడు సార్లు పులుసు లేదా ఫ్రై లాగిస్తాం. చికెన్ మటన్ తో పోల్చుకుంటే కొవ్వు తక్కువగా ఉంటుందని చేపలు ప్రిఫర్ చేస్తున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. మీరు సముద్రం లేదా నదుల్లో పట్టే చేపలు తింటే పర్వాలేదు. కానీ చెరువుల్లో పెంచే చేపలు తింటే మాత్రం చెడ్డకి వెళ్ళిపోవడం, కాయం. ఎందుకంటే వాటికి వేస్తున్న మేత అలాంటిదే. పెద్దగా ఖర్చు లేకుండా పెద్ద మొత్తంలో లాభాలు అర్జించాలనే ఉద్దేశంతో కొందరు చేపల చెరువుల యజమానులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.

కాసులు కురిపిస్తున్న కోడి వ్యర్థాల వ్యాపారానికి భాగ్యనగరం అడ్డాగా మారింది. ప్రతి రోజు వందల టన్నుల చికెన్ వేస్ట్ ను అక్రమంగా హైదరాబాద్ నుండి ఆంధ్రాకు తరలించి చేపల చెరువుల్లో కుమ్మరిస్తున్నారు. కోడి వ్యర్థాలతో చేపల సాగు చట్ట విరుద్ధమని తెలిసి కూడా ఎడమేశ్టుగా రవాణా చేస్తున్నారు. అలాంటి చేపలను తింటే ప్రజల ప్రాణాలకు ప్రమాదమని తెలిసి కూడా తప్పు చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలోని చికెన్ షాపుల్లో మిగిలిపోయిన కోడి వ్యర్థ పదార్థాలను కొందరు కేటుగాళ్లు సిండికేట్ గా ఏర్పడి సేకరిస్తున్నారు. ప్రతిరోజు 300 టన్నుల చికెన్ వేస్ట్ ను గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ నుండి ఆంధ్రాకు తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం :

బస్సు వెనుక సీటులో ప్రేమ జంట పిచ్చి పనులు వీడియో

మస్క్‌ కంటి కింద నల్లటి గాయం ఎవరు కొట్టారు? ఏం జరిగింది? వీడియో

ఇద్దరికీ పెళ్లయింది.. ఫేస్‌బుక్‌ పరిచయంతో వివాహేతర సంబంధం.. చివరకు వీడియో