ప్రేమగా స్వీట్ పెడితే నిరాకరించిన వధువు.. వరుడు ఏం చేశాడో చూడండి
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పెళ్లంటేనే పెద్ద హడావిడి. బంధుమిత్రులంతా ఓ చోట చేరి సందడిగా పెళ్లి పనులు చేస్తూ.. సరదాగా కీచులాడుకుంటూ..మధ్యలో వధూవరులను ఆటపట్టించడం ఎంతో సరదాగా ఉంటుంది. ఇటీవల కాలంలో పెళ్లి వేదికపైనే వధూవరులు చేసే చిత్ర విచిత్రమైన పనులు నెట్టింట వైరల్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా ఓ పెళ్లి వేదికపై వరుడు వధువుకు స్వీటు తినిపించబోతే ఆమె వద్దని నిరాకరిస్తుంది. దాంతో వరుడికి చిర్రెత్తుకొస్తుంది. ఈ క్రమంలో వరుడు చేసిన పనికి బంధుమిత్రులంతా షాకవుతారు. ఆ తర్వాత అంత నవ్వేస్తారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వివాహ వేదికపై వధూవరులు ఉన్నారు. జయమాల కార్యక్రమం జరుగుతోంది. వధూవరులు దండలు మార్చుకున్న తర్వాత వధువుకి వరుడు స్వీట్ తినిపించడానికి ప్రయత్నించాడు. కానీ ఆ స్వీట్ తినడానికి వధువు ఇష్టపడలేదు. దాంతో చిర్రెత్తుకొచ్చిన వరుడు ఆ స్వీట్‌ను నేలకేసి కొడతాడు. ఆ సంఘటనతో అక్కడున్న వారందరూ షాక్‌తో చూస్తుండిపోయారు. వరుడు కోపంతో గట్టిగా మాట్లాడుతున్నాడు. ఎవరూ అతనికి అడ్డుచెప్పలేదు. కాసేపటికి పరిస్థితి చక్కబడటంతో అందరూ హ్యాపీగా నవ్వుకున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారిపోయింది. ఈ వీడియోను ఇప్పటివరకు నాలుగున్నర లక్షలమందికి పైగా వీక్షించారు. వేలాదిమంది లైక్ చేశారు. వీడియోపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ముక్క లేనిదే ముద్ద దిగదు.. మాంసాహారంలో తెలంగాణ టాప్
పాములా ప్రవర్తిస్తూ యువతి వింత చేష్టలు.. ఆ గ్రామంలో వింత ఘటన!
ఆయుష్షు గట్టిది అంటే ఇదే.. పెను ప్రమాదంలో కూడా
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

