పాములా ప్రవర్తిస్తూ యువతి వింత చేష్టలు.. ఆ గ్రామంలో వింత ఘటన!
టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రపంచం ఎంతో ముందుకు వెళ్తుంది. మానవుడు స్పేస్ యాత్రలతో ఇతర గ్రహాలపై కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. అయినా కొన్ని నమ్మకాలు ప్రజలకు దూరం కావడం లేదు. చేతబడి, దెయ్యాలు వంటి వాటికి ఇప్పటికీ భయపడుతున్నారు. నాగుపాములంటే సాధారణంగా మనిషి వెన్నులో వణుకుపుడుతోంది. పాము కనిపించిందంటే చాలు ఆమడ దూరం పరిగెడతాం.
అదే పాము పుట్టలు ఉన్న చోట కాలు కూడా పెట్టం. పాములంటే మనుషులకు చచ్చేంత భయం. అదే నాగుల చవితి వచ్చిందంటే చాలు దేశ వ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటాం. పుట్టలెక్కడున్నాయా? అని వెతికి మరీ పాలు పోస్తాం. హిందూ సాంప్రదాయంలో పాములకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి దేవాలయంలోనూ నాగ దేవతకు సంబంధించిన విగ్రహాలు, పుట్టలు కనిపిస్తాయి. కొందరు వాటిని కులదైవాలుగా కొలుస్తారు. అయితే సినిమాలు, సీరియళ్ల ప్రభావమో.., లేక మానసిస్థితి బాగోలేకనో ఒడిశా రాష్ట్రంలో ఓ యువతి పాములా వింతగా ప్రవర్తించింది. మయూర్‌భంజ్ జిల్లా చక్కపాల్ గ్రామంలో మీనాక్షి అనే యువతి పాములా బుసలు కొడుతూ నేలమీద మెలికలు తిరిగింది. అసలేం జరిగిందంటే.. మీనాక్షి ఇంట్లోకి ఓ పాము వచ్చింది. అది గమనించిన ఆమె తండ్రి కుటుంబసభ్యుల్ని అలర్ట్ చేసారు. స్నేక్ హెల్ప్‌లైన్‌కి సమాచారం ఇచ్చారు. కాసేపటికి స్నేక్ క్యాచర్లు ఇంటికొచ్చారు. పామును బంధించే ప్రయత్నంలో వారున్నారు. అంతలో అక్కడే ఉన్న మీనాక్షి కింద పడి అచ్చం పాములా ప్రవర్తించడం మొదలుపెట్టింది. నన్ను తీసుకెళ్లకండి నేను రాను ఇక్కడే ఉంటాను. నన్ను చంపకండి అంటూ అరుస్తూ రచ్చ రచ్చ చేసింది. ఊహించని ఘటన చూసి గ్రామస్తులు, స్నేక్ క్యాచర్లు షాక్ అయ్యారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆయుష్షు గట్టిది అంటే ఇదే.. పెను ప్రమాదంలో కూడా
పిల్లాడితో కలిసి ఫుట్‌బాల్ ఆడిన కాకి.. వీడియో వైరల్
103 ఏళ్ల బామ్మ మేకప్ పాఠాలు.. ఫిదా అవుతున్న యూత్
లాటరీలో వచ్చిన రూ.30 కోట్లు ప్రియురాలి అకౌంట్లో వేశాడు.. మరుక్షణం ఆమె
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

