AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్రైవరన్నకు సెల్యూట్.. హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్తుండగా గుండెపోటు.. చివరకు..

వ్యాపారస్తులకు వినియోగదారుడే దేవుడు. అలానే ఆర్టీసీ సిబ్బందికి కూడా ప్రయాణికులే దేవుళ్ళుగా భావిస్తుంటారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే ఆర్టీసీ డ్రైవర్ల విధి. అయితే తన విధి ధర్మాన్ని పాటించి చాతి నొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలనే బాధ్యతతో ఉన్నాడు.

డ్రైవరన్నకు సెల్యూట్.. హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్తుండగా గుండెపోటు.. చివరకు..
Apsrtc
M Revan Reddy
| Edited By: |

Updated on: Jan 26, 2026 | 6:03 PM

Share

వ్యాపారస్తులకు వినియోగదారుడే దేవుడు. అలానే ఆర్టీసీ సిబ్బందికి కూడా ప్రయాణికులే దేవుళ్ళుగా భావిస్తుంటారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే ఆర్టీసీ డ్రైవర్ల విధి. అయితే తన విధి ధర్మాన్ని పాటించి చాతి నొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలనే బాధ్యతతో ఉన్నాడు. చివరి నిమిషం వరకు బస్సును సురక్షితంగా రోడ్డు పక్కన ఆపి, ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు ఓ ఆర్టీసీ డ్రైవర్. కానీ చివరికి ఆ ఆర్టీసీ డ్రైవర్ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మధ్యాహ్నం హైదరాబాదు మియాపూర్ నుండి విజయవాడకు బయలు దేరింది. బస్సులు 18 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్ నుండి బయలుదేరినప్పటి నుండి డ్రైవర్ నాగరాజుకు ఛాతిలో నొప్పి వస్తోంది. అయినా చౌటుప్పల్ సమీపంలోకి రాగానే ఛాతీలో నొప్పి ఎక్కువైంది. సాధారణ నొప్పి అనుకుని చివరి నిమిషం వరకు బస్సును సురక్షితంగా నడిపాడు.. ప్రయాణికుల ప్రాణాలను కాపాడే బాధ్యతతో చౌటుప్పల్ వరకు వచ్చాడు. కానీ గుండెలో నొప్పిని ఇక తట్టుకోలేకపోయాడు.. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా పక్కకు బస్సును ఆపేశాడు.

వెంటనే ఆటోలో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాడు. కానీ దురదృష్టవశాత్తు డాక్టర్లు లేకపోవడంతో.. ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుని ఆటో డ్రైవర్ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లాడు. నాగరాజుని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు. తమ ప్రాణాలను కాపాడేందుకు ఛాతీ నొప్పితో డ్రైవింగ్ చేసిన నాగరాజు మృతి ప్రయాణికులను కలిసి వేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నాని సినిమాలో ఛాన్స్ అలా మిస్సయ్యింది.. నాగ దుర్గ..
నాని సినిమాలో ఛాన్స్ అలా మిస్సయ్యింది.. నాగ దుర్గ..
23 ఏళ్ల తర్వాత శ్రీలంకపై టెస్ట్ సిరీస్ కొట్టిన వెస్టిండీస్
23 ఏళ్ల తర్వాత శ్రీలంకపై టెస్ట్ సిరీస్ కొట్టిన వెస్టిండీస్
ఫ్రెంచ్ అధికారి పేరుతో HYDలో పెద్ద ఏరియా! మూసారామ్‌బాగ్ చరిత్ర
ఫ్రెంచ్ అధికారి పేరుతో HYDలో పెద్ద ఏరియా! మూసారామ్‌బాగ్ చరిత్ర
పీఎఫ్ వడ్డీ మీకు వచ్చిందా..? లేదా..? ఇలా చెక్ చేస్కోండి..
పీఎఫ్ వడ్డీ మీకు వచ్చిందా..? లేదా..? ఇలా చెక్ చేస్కోండి..
అల్లు అర్జున్ రాకా సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్..
అల్లు అర్జున్ రాకా సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్..
ఆ హీరో సినిమాలో ఛాన్స్.. మూడు రోజుల్లో షూటింగ్ అని చెప్పి..
ఆ హీరో సినిమాలో ఛాన్స్.. మూడు రోజుల్లో షూటింగ్ అని చెప్పి..
కుటుంబ సమస్య పరిష్కారం కోసం వచ్చిన మహిళపై దారుణం..
కుటుంబ సమస్య పరిష్కారం కోసం వచ్చిన మహిళపై దారుణం..
రూ. 6నుండి రూ7లక్షల బడ్జెట్‌లో బెస్ట్ మైలేజ్, సేఫ్టీ ఇచ్చే కార్లు
రూ. 6నుండి రూ7లక్షల బడ్జెట్‌లో బెస్ట్ మైలేజ్, సేఫ్టీ ఇచ్చే కార్లు
మీ ఫొటోలతో మీకు తెలియకుండానే AI ఇమేజస్..!
మీ ఫొటోలతో మీకు తెలియకుండానే AI ఇమేజస్..!
రాత్రిళ్లు హఠాత్తుగా మేల్కొంటున్నారా? పీడకలలు, భయాలు వెంటాడుతు..
రాత్రిళ్లు హఠాత్తుగా మేల్కొంటున్నారా? పీడకలలు, భయాలు వెంటాడుతు..