Konijeti Rosaiah: మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు పూర్తి.. కోంపల్లి ఫాంహౌస్‌కు తరలొచ్చిన ప్రముఖులు
Konijeti Rosaiah Funeral: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని
Konijeti Rosaiah Funeral: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని తన ఫామ్ హౌస్‌లో మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలను నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. రోశయ్య మరణంతో కుటుంబసభ్యులు, అభిమానులు, కాంగ్రెస్ నేతలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన అంత్యక్రియలకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, అభిమానులు కూడా హాజరయ్యారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం కన్నుమూశారు.
రోశయ్య మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం కేసీఆర్, వైఎస్ జగన్, కేంద్రమంత్రులు, పలువురు రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మూడు రోజులపాటు సంతాప దినాలను ప్రకటించింది.
Also Read:
Jawad Cyclone: జొవాద్ ఎఫెక్ట్.. విశాఖలో ముందుకు చొచ్చుకొచ్చిన సముద్రం.. అధికారుల అలెర్ట్..
Hyderabad: రెండేళ్ల నుంచి భర్తతో విభేదాలు.. ఆత్మహత్య చేసుకున్న బ్యూటీషియన్