Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్..అధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు.. 10 రోజుల్లోనే ‘రైతుబంధు’

Rythu Bandhu: యాసంగి సీజన్ పంటల సాగు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతు బంధు నిధులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. ఎకరానికి 5 వేల రూపాయల..

Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్..అధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు.. 10 రోజుల్లోనే ‘రైతుబంధు’
Rythu Bandhu
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 05, 2021 | 4:44 PM

తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. యాసంగి సీజన్ పంటల సాగు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతు బంధు నిధులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. ఎకరానికి 5 వేల రూపాయల చొప్పున సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు ఏకంగా 7,500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిధుల సర్దుబాటుపై ఆర్థిక శాఖ ఇప్పటికే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిన్న టీఆర్ఎస్ ఎంపీలతో జరిగిన సమావేశంలో.. సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని కూడా గుర్తు చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 15 నుంచి అంటే మరో పది రోజుల్లోనే తెలంగాణ రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేయాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. అలాగే టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో… తెలంగాణ రాష్ట్ర రైతుల తరపున తమ గొంతును గట్టిగా వినిపించాలని.. దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.

వానాకాలం సీజన్‌కు సంబంధించి జూన్‌ నెలలో 60.84 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయంగా రూ.7,360.41 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.47 కోటి ఎకరాలకు నిధుల పంపిణీ జరిగింది. అయితే ఈ యాసంగి సీజన్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందిన రైతుల సంఖ్య, అందుకు అనుగుణంగా భూవిస్తీర్ణం పెరిగితే బడ్జెట్‌ కూడా పెరగనుంది. ఈ నేపథ్యంలోనే సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు పంపిణీ చేయడానికి రూ.7,500 కోట్లు అవసరముంటుందని వ్యవసాయ, ఆర్థిక శాఖలు అంచనా వేశాయి.

ఇక గత వానాకాలం సీజన్‌లో మొదటి రోజు ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు, రెండో రోజు రెండెకరాలు, మూడో రోజు మూడెకరాలున్న వారికి.. ఇలా ఆరోహణ పద్ధతిలో నగదు బదిలీ చేశారు. ఈసారి కూడా అదే పద్ధతిలో పంపిణీ చేసేందుకు అధికారులులు సిద్ధమవుతున్నారు.

ఇవి కూడా చదవండి: Snoring Tips: గుడ్ న్యూస్.. గురకను మాయం చేసే అద్భుతమైన నివారణ చిట్కా..

IND vs NZ, 2nd Test, Day 2 Live Updates: మూడో వికెట్ కూల్చిన అశ్విన్.. రాస్ టేలర్ అవుట్..