AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karimnagar district: చల్మెడ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం.. పదుల సంఖ్యలో విద్యార్థులకు పాజిటివ్

ఒకవైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కలవరపెడుతోంది. దీంతో ప్రపంచ దేశాలు పానిక్ మోడ్‌లోకి వెళ్లాయి. చాలా దేశాలు ఆంక్షలు అమలు చేస్తున్నాయి.

Karimnagar district: చల్మెడ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం.. పదుల సంఖ్యలో విద్యార్థులకు పాజిటివ్
Coronavirus
Ram Naramaneni
|

Updated on: Dec 05, 2021 | 6:32 PM

Share

ఒకవైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కలవరపెడుతోంది. దీంతో ప్రపంచ దేశాలు పానిక్ మోడ్‌లోకి వెళ్లాయి. చాలా దేశాలు ఆంక్షలు అమలు చేస్తున్నాయి. గత పాఠాల సారాల నుంచి ఈసారి అలాంటి మారణ హోమాలు ఉండకూడదని జాగ్రత్తపడుతున్నాయి. ఈ కొత్త వేరియంట్ భయోత్పాతాలు సృష్టిస్తుంటే..  మరోవైపు పాత కరోనా కలకలం కంటిన్యూ అవుతోంది. కరీంనగర్‌ జిల్లాలోని చల్మెడ మెడికల్ కాలేజీలో 43 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. ఒక్కసారిగా కలకలం రేగింది. మిగతా విద్యార్థులకు కరోనా టెస్ట్‌లు చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా కాలేజీకి సెలవులు ప్రకటించింది యాజమాన్యం.

అత్యంత అప్రమత్తంగా ఉండాలి: వైద్యారోగ్య శాఖ

కాగా కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాసరావు సూచించారు. కొవిడ్​ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు దాస్తున్నామన్న వార్తలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. తప్పుడు వార్తలతో వైద్యారోగ్యశాఖ మనోస్థైర్యం తగ్గుతుందని.. కరోనా కంటే తప్పుడు వార్తలు ప్రమాదకరమన్నారు. జనవరి 15 తర్వాత రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని.. ఫిబ్రవరిలో భారీగా కేసులు నమోదు కావొచ్చని డీహెచ్​ అభిప్రాయపడ్డారు. ప్రజలంతా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని.. లేదంటే కావాలనే ప్రమాదాన్ని ఆహ్వానించినట్లు అవుతుందని  స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు.  కరోనా మూడో దశను ఎదుర్కోడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్న ఆయన.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

Also Read:  అనసూయ ఇంట తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతున్న స్టార్ యాంకర్

చెత్త ఏరుకునే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్న వివాహిత.. మర్డర్ కేసు విచారణలో నమ్మలేని విషయాలు