Telangana: కాటేసిన పాము.. పసుపు రాసి నిద్రపుచ్చిన ఆయమ్మ.. పాపం చిట్టి తల్లి

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని బయ్యారంలో మాటలకందని విషాదం చోటుచేసుకుంది. ఊహించని పరిణామంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Telangana: కాటేసిన పాము.. పసుపు రాసి నిద్రపుచ్చిన ఆయమ్మ.. పాపం చిట్టి తల్లి
Snakebite
Follow us
Ram Naramaneni

| Edited By: Anil kumar poka

Updated on: Nov 30, 2021 | 5:10 PM

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని బయ్యారంలో మాటలకందని విషాదం చోటుచేసుకుంది. ఉదయం ఇంట్లో సందడి చేసి.. అమ్మ-నాన్నలకు టాటా చెప్పి ఇంటి నుంచి అంగన్వాడీకి వెళ్లిన నాలుగేళ్ల చిన్నారి సాయంత్రానికి విగతజీవిగా మారిపోయింది. మాయదారి పాము చిన్నారి జీవితాన్ని మింగేసింది. అయితే ఇక్కడ ఆయమ్మ నిర్లక్ష్యం పాప పాలిట శాపమైంది. వివరాల్లోకి వెళ్తే.. బయ్యారానికి చెందిన కామల్ల రాజు – సంతోష దంపతుల తనయ నిత్యశ్రీ(4) ఏడాదిన్నరగా అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తోంది. గురువారం రోజు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అక్కడే ఆడుకుంటున్న నిత్యశ్రీ ఒక్కసారిగా కిందపడిపోయింది. ఎడమకాలు పాదం వద్ద రక్తం రావడాన్ని గమనించిన ఆయా ఢాకమ్మ.. కిందపడటం వల్ల  గాయం అయ్యింది అనుకుని పసుపురాసి, కట్టుకట్టి అక్కడే పడుకోబెట్టింది. కాసేపటి తర్వాత అన్నం పెట్టేందుకని చిన్నారిని లేపే ప్రయత్నం చేసింది. లేవకపోవడంతో వెంటనే ఆశా వర్కర్ అనిత చిన్నారి తల్లికి సమాచారం అందించింది. వారంతా పాపను హుటాహుటిన గజ్వేల్‌ గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు.

పరీక్షించిన డాక్టర్లు పాముకాటుతో చిన్నారి మృతి చెందినట్టు ధ్రువీకరించారు. అంగన్‌వాడీ కేంద్రం పక్కనే మురుగు కాల్వ, గవర్నమెంట్ స్కూల్ ప్రహరీ ఉన్నాయి. మూత్ర విసర్జన కోసం ప్రహరీ వద్దకు వెళ్లిన సమయంలో పాము కాటేసి ఉంటుందనే అనుమానంతో స్థానికులు అక్కడ పరిశీలించారు. గోడ మధ్యలో కన్నాలకు గుర్తించి తవ్వారు. రెండు నాగుపాము పిల్లలను గుర్తించి చంపేశారు. పాముకాటును ఆయమ్మ గుర్తించి ఉంటే చిన్నారి ప్రాణం పోకుండా ఉండేదని పాప పేరెంట్స్ కన్నీటిపర్యంతమయ్యారు. చిట్టి తల్లి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Also Read: ‘ఛత్రపతి’ సూరీడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..? మీరు అస్సలు గుర్తుపట్టలేరు

100 కిలోమీటర్లు ప్రయాణం.. కారులో నుంచి వింత శబ్దాలు.. ఆపి చెక్ చేయగా షాక్