Telangana Weather Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. రానున్న మూడు గంటల పాటు దంచికొట్టనున్న వాన..
Telangana Weather Alert: మరికొద్ది గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. రానున్న మూడు గంటల పాటు..
Telangana Weather Alert: మరికొద్ది గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. రానున్న మూడు గంటల పాటు తెలంగాణలో వాన దంచికొతుందని చెప్పారు. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా క్యూములోనింబస్ మేఘాలు వ్యాపించి ఉన్నాయని వీటి ఫలితంగా పగలంతా ఠారెత్తించే ఎండలు, సాయంత్రం భారీ వర్షాలు కురిస్తాయని అధికారులు తెలిపారు. ఇవాళ మాత్రమ కాకుండా, రేపు, ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ క్యూములోనింబస్ మేఘాల కారణంగా.. రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా, మేడ్చల్, హైదరాబాద్, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లా్ల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించారు. ప్రజలు, అధికారులు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. కాగా, వాతావరణ నివేదికల నేపథ్యంలో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాలు కురిస్తే వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా క్షేత్రస్థాయిలో సహాయక బృందాలను సిద్ధం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు.. ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 10° ఉత్తర అక్షాంశము వెంబడి తూర్పు-పడమర ‘షీర్ జోన్’ సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తుల మధ్య కొనసాగుతోందన్నారు. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరకోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో రాగ మూడు రోజుల వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ముఖ్యంగా ఉత్తరకోస్తాంధ్రాలో ఈరోజు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రలో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసే ఛాన్స్ ఉంది. ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఇవాళ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే ఛాన్స్ ఉంది. రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
Also read:
Liquor Sales: ఎక్కువగా చదువుకున్నారు మీరే ఇలా చేస్తే ఎలా బ్రో.. మత్తులో తూలుతున్న ఆ రాష్ట్ర ప్రజలు..
Maha Ganesha: ఆహా మరో ముందడుగు.. పిల్లల కోసం ప్రత్యేకంగా మహా గణేశ.. వినోదంలో మరింత జోష్..