Liquor Sales: ఎక్కువగా చదువుకున్నారు మీరే ఇలా చేస్తే ఎలా బ్రో.. మత్తులో తూలుతున్న ఆ రాష్ట్ర ప్రజలు..

Liquor Sales: ఆ రాష్ట్రం దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలకు ఆదర్శం. ముఖ్యంగా కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో.. ఎంతో చాకచక్యంగా, బాధ్యతతో వ్యవహరించారు ఆ రాష్ట్ర ప్రజలు...

Liquor Sales: ఎక్కువగా చదువుకున్నారు మీరే ఇలా చేస్తే ఎలా బ్రో.. మత్తులో తూలుతున్న ఆ రాష్ట్ర ప్రజలు..
Liquor
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 24, 2021 | 5:38 PM

Liquor Sales: ఆ రాష్ట్రం దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలకు ఆదర్శం. ముఖ్యంగా కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో.. ఎంతో చాకచక్యంగా, బాధ్యతతో వ్యవహరించారు ఆ రాష్ట్ర ప్రజలు. అలా తొలి దశలో కరోనా వైరస్ పీచమణిచి దేశానికే మార్గనిర్దేశనం చేసింది. ఇది మాత్రమే కాదు.. చదువులోనూ, పరిపాలనలోనూ, విద్యా విధానాల్లోనూ, సంక్షేమంలోనూ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ వస్తుంది. అయితే, ఆ లిస్ట్‌‌లో మరో బ్యాడ్ హ్యాబిట్ కూడా చేరింది. అన్నింట్లో ముందుండే తాము.. ఇందులో మాత్రం ఎందుకు తక్కువ ఉండాలి అని భావించారో ఏమో గానీ, దేశంలోనే సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. వారే కేరళీయులు. ఉన్నత విద్యావంతులుగా ఆ రాష్ట్ర ప్రజలను యావత్ భారత్ గౌరవిస్తుంటుంది. కానీ, తాజాగా వెల్లడైన గణాంకాలు.. కేరళీయులు కూడా అదే బ్యాచ్‌కు చెందిన వారా? అనుకుంటూ ముక్కున వేలేసుకునేలా ఉన్నాయి. దేశంలోనే ఉన్నత విద్యావంతులుగా గుర్తింపు పొందిన కేరళీయులు.. తాజాగా తాము మందు బాబులం కూడా అని నిరూపించుకున్నారు.

వివరాల్లోకెళితే.. కేరళలో అతి ముఖ్యమైన పండుగ ‘ఓనం’. ఇటీవలే ఈ ఫెస్టివల్ ముగిసింది. ఈ పండుగను పురస్కరించుకుని ప్రజలు.. తమ బంధువులు, స్నేహితులతో సంబరాలు చేసుకున్నారు. ఈ పండుగను కేరళ ప్రజలు దాదాపు మూడు నుంచి నాలుగు రోజులు జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మద్యానికి ఊహించని రీతిలో డిమాండ్ పెరిగింది. కరోనా సంక్షోభం వల్ల ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పటికీ.. కేరళలో ఈ ఏడాది మద్యం అమ్మకాలు రికార్డ్ స్థాయిలో నమోదు అయ్యాయి. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏకంగా రూ. 750 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించారు. ఇది ఆ రాష్ట్ర చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డ్ అని అక్కడి అధికార, మీడియా వర్గాలు వెల్లడించాయి.

ఓనమ్ సీజన్‌లో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కేరళ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ (BevCo) పరిధిలోని వైన్ షాపులు రూ. 750 కోట్ల విలువైన మద్యం విక్రయించాయి. ఓనం పండుగకు ఒక రోజు ముందు అంటే ఆగస్టు 20న రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ. 20 కోట్ల మేర మద్యం విక్రయాలు సాగాయి. కొన్ని ప్రదేశాలలో, ముఖ్యంగా తిరువనంతపురంలోని ఒక బెవ్‌కో అవుట్‌లెట్ నుంచి గంటల వ్యవధిలోనే సుమారు రూ. 1.04 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఇది కేరళ చరిత్రలోనే అత్యధికం అని ఆ రాష్ట్ర మీడియా వర్గాలు చెబుతున్నాయి. బెవ్‌కో ఆగస్టు 11 నుంచి 21 తేదీల మధ్యలో అంటే పది రోజుల వ్యవధిలో రూ. 750 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని, ఇది ఆల్‌టైమ్ రికార్డ్ అని బెవ్‌కో మేనేజింగ్ డైరెక్టర్ యోగేష్ గుప్తా తెలిపారు. కాగా, గతేడాది ఓనం సందర్భంగా రూ.565 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగాయని చెప్పారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో రూ. 750 కోట్ల అమ్మకాలు జరిగాయన్నారు. అయితే, ఈ రూ. 750 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 600 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. కాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా.. వైన్స్ షాపుల వద్ద రద్దీని తగ్గించాలనే లక్ష్యంతో ఈ ఏడాది బెవ్‌ కో ఆన్‌లైన్‌లో మద్యం విక్రయాలు జరిపింది.

ఏదేమైనా కేళరీయులు విద్యాభ్యాసంలోనే కాదు.. మద్యం సేవించడంలోనూ ముందు ఉంటామని ఈ గణాంకాల ద్వారా యావత్ సమాజానికి చాటి చెప్పారు. ఈ గణంకాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంత ఎక్కువగా చదువకున్నారు.. ఇదేం విధానాలు బ్రో అంటూ వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ‘‘యావత్ దేశం మీవైపు చూస్తుంటే.. మీరేమో ఇలా మద్యం వైపు చూస్తున్నారు.’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also read:

Ind Vs Eng: మూడో టెస్టుకు టీమిండియాలో రెండు మార్పులు.. ఆ ఇద్దరికి ఉద్వాసన.. ఎవరంటే!

LIC Policy: ఎల్‌ఐసీలో అదిరిపోయే పాలసీ.. రూ.40 పొదుపుతో.. ఏటా రూ.40 వేలు పొందవచ్చు..!

న్యూజిలాండ్ లో ఒక్క రోజులో పెరిగిన కోవిడ్-19 కేసులు..గత ఏడాది ఏప్రిల్ తరువాత తొలిసారిగా..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!