మరికొన్ని గంటల్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. రెండో టెస్టులో విజయం సాధించిన టీమిండియా గెలుపే ధ్యేయంగా బరిలోకి దిగుతుండగా.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో నిలవాలన్న పట్టుదలతో ఇంగ్లాండ్ జట్టు తీవ్ర కసరత్తులు చేస్తోంది.
1 / 4
ఇదిలా ఉంటే టీమిండియా రెండు మార్పులతో హెడింగ్లీ టెస్టుకు సిద్దమైంది. సీనియర్ ఆఫ్ స్పిన్నర్‌తో పాటు యువ బౌలర్‌కు టీం మేనేజ్‌మెంట్ జట్టులో చోటు కల్పించింది. అనుభవజ్ఞుడైన రవిచంద్రన్ అశ్విన్, శార్దుల్ ఠాకూర్‌లను తుది జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ స్థానాల్లో ఈ ఇద్దరూ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రానున్నారు.