తెలంగాణ సర్కారు ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా రైతులు

కృష్ణా జలాలపై ఏపీ- తెలంగాణ రాష్రాల మధ్య తలెత్తిన వివాదంపై ఇప్పుడు మరో టర్న్ తీసుకుంది...

తెలంగాణ సర్కారు ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా రైతులు
TS High Court
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 05, 2021 | 2:45 PM

Krishna water dispute : కృష్ణా జలాలపై ఏపీ- తెలంగాణ రాష్రాల మధ్య తలెత్తిన వివాదంపై ఇప్పుడు మరో టర్న్ తీసుకుంది. జూన్ 28వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా రైతులు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. దీనిపై ఈ మధ్యాహ్నాం 2.30 గం.లకు విచారణ చేపట్టింది.

తెలంగాణ ప్రభుత్వం జీవో నెం. 34 విడుదల చేసి.. విద్యుత్ ఉత్పత్తికి నీటిని అక్రమంగా తరలిస్తుందని పిటిషన్‌ లో రైతులు కోర్టుకు విన్నవించారు. వెంటనే జీవోను కొట్టేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని లంచ్ మోషన్ పిటిషన్ వేశారు.

ఇలా ఉండగా, కృష్ణా జలాల్లో తెలంగాణ‌ వాటా కింద వచ్చే జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమ‌ని తెలంగాణ స‌ర్కారు తేల్చి చెబుతోంది. అలాగే, తాము జల విద్యుదుత్పత్తిని కూడా ఆపబోమ‌ని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు చేప‌ట్టింద‌ని అంటోంది.

ఇలాఉండగా, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కాపాడటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపిస్తున్నారు . రాష్ట్ర వాటాను రక్షించాలంటే కేఆర్ఎంబీ పరిధి నోటిఫై చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అందుకోసం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ కు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను వెల్లడించారు.

కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్ర హక్కులు కాపాడాలంటే కేఆర్ఎంబీ పరిధి నోటిఫై తప్పనిసరి అన్నారు. జగన్, కేసీఆర్ ఇద్దరు సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు తప్ప రాష్ట్రాల హక్కుల్ని కాపాడాలని పనిచేయడం లేదని ఆరోపించారు. ఇద్దరు చేతులు కలిపి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని విమర్శించారు. కృష్ణా నదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు కట్టేందుకు కేసీఆరే అవకాశం ఇచ్చి తెలంగాణ కు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు.

Read also :  ట్రాన్సాక్షన్ చేయకుండానే క్రెడిట్ కార్డ్ నుంచి రెండున్నర లక్షలు వాడినట్టు మెసేజ్ వచ్చింది.. అసలు కథ ఇదీ..!