Telangana: అతడు పెళ్లి చేసుకోవట్లేదు.. వేరేవాళ్లని చేస్కోనివ్వట్లేదు.. దీంతో ఆమె ఏం చేసిందంటే..?

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Jul 05, 2021 | 3:22 PM

'అవ్వా పెట్టదు, అడుక్కోనియ్యదు' అన్నట్టు ఉంది ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి కథ. అతడు పేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోడట.. అలాగని ఇంకొకర్ని చేసుకుంటా అంటే ఒప్పుకోడట. దీంతో..

Telangana: అతడు పెళ్లి చేసుకోవట్లేదు.. వేరేవాళ్లని చేస్కోనివ్వట్లేదు.. దీంతో ఆమె ఏం చేసిందంటే..?
Women Cheting

Follow us on

‘అవ్వా పెట్టదు అడుక్కోనియ్యదు’ అన్నట్టు ఉంది ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి కథ. అతడు పేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోడట.. అలాగని ఇంకొకర్ని చేసుకుంటా అంటే ఒప్పుకోడట. దీంతో చిర్రెత్తుకొచ్చిన యువతి ప్రియుడి ఇంటివద్ద బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని పట్టుబడుతుంది. అరె ఇదెక్కడి కథరో అనుకుంటున్నారా..? పదండి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండల కేంద్రంలో ప్రియుడి ఇంటి వద్ద ప్రియురాలు బైఠాయించింది. పెళ్లి చేసుకోకుండా మోసం చేస్తున్నాడని గడ్డం ప్రమోద్‌రెడ్డి అనే యువకుడి ఇంటి ముందు రజిత అనే యువతి ధర్నా జేసింది. తనక న్యాయం చేయాలని అతడి ఇంటిముందు ఆందోళనకు దిగింది.

గడ్డం ప్రమోద్ రెడ్డి, రజితలు గత నాలుగేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాలు పెండ్లికి నో చెప్పాయి. దీంతో అమ్మాయికి వేరే పెండ్లి సంబంధం చూసి నిశ్చితార్థం కూడా చేశారు. నిజామాబాద్ జిల్లా గోందూరుకు చెందిన అబ్బాయితో మ్యాచ్  ఫిక్స్ చేశారు.  ఈ సంగతి తెలుసుకున్న ప్రియుడు గడ్డం ప్రమోద్ రెడ్డి పెండ్లి కొడుకు ఇంటివి వెళ్లాడు. తాను ప్రేమించిన రజితను ఎట్లా పెళ్లి చేసుకుంటావని నిలదీశాడు. దీంతో ఈ గొడవంతా మనకెందుకు అనుకున్న ఆ అబ్బాయివాళ్లు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. సరే.. జరిగిందేదో జరిగింది…  తనను పెళ్లి చేసుకోమని రజిత  ప్రియుడు ప్రమోద్‌రెడ్డిని కోరింది. అందుకు మాత్రం అతడు ముఖం చాటేస్తున్నాడు. ప్రమోద్ రెడ్డి ప్రవర్తనతో విసిగివేసారిన  రజిత  తనను మోసం చేస్తున్నాడని కుటుంబంతో సహా వచ్చి అతడి ఇంటి వద్ద బైఠాయించింది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు, కుటుంబ సభ్యులతో సహా అక్కడ్నుంచి ఎస్కేప్ అయ్యాడు. రంగంలోకి దిగిన పోలీసులు. ప్రమోద్‌రెడ్డి ఇంటివద్దకు తీసుకువచ్చి ఇద్దరితో మాట్లాడారు. పోలీస్ స్టేషన్‌కొస్తే సమస్య పరిష్కరిస్తామని చెప్పారు.

Also Read: అమ్మ అపస్మారక స్థితిలో.. తమ్ముడు గుక్కెట్టి ఏడుస్తున్నాడు.. ఆ చిట్టి తల్లి ఏం చేసిందంటే

ఎంగేజ్మెంట్ తోనే ఎండ్ కార్డ్ .. పెళ్లిపీటలెక్కకుండానే విడిపోయిన జంటలు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu