AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మ అపస్మారక స్థితిలో.. తమ్ముడు గుక్కెట్టి ఏడుస్తున్నాడు.. ఆ చిట్టి తల్లి ఏం చేసిందంటే

ఆ చిట్టి తల్లికి సరిగ్గా మాటలు కూడా రావు. మహా అయితే రెండున్నరేళ్ల వయసు ఉంటుంది. అయితేనేం.. తన తల్లిని, తమ్ముడిని కాపాడుకుంది. ఆ చిన్నారుల తల్లి  ఓ రైల్వే వంతెనపై...

అమ్మ అపస్మారక స్థితిలో.. తమ్ముడు గుక్కెట్టి ఏడుస్తున్నాడు.. ఆ చిట్టి తల్లి ఏం చేసిందంటే
Girl Saves Mother Life
Ram Naramaneni
|

Updated on: Jul 04, 2021 | 6:17 PM

Share

ఆ చిట్టి తల్లికి సరిగ్గా మాటలు కూడా రావు. మహా అయితే రెండున్నరేళ్ల వయసు ఉంటుంది. అయితేనేం.. తన తల్లిని, తమ్ముడిని కాపాడుకుంది. ఆ చిన్నారుల తల్లి  ఓ రైల్వే వంతెనపై స్పృహతప్పి పడిపోయింది. పాలు తాగే వయసున్న బాబు  అమ్మ లేవకపోవపోయేసరికి.. గుక్కబట్టి ఏడుస్తున్నాడు. ఈ పరిస్థితిలో రెండున్నర వయస్సు పిల్లలు ఎవరైనా సరే.. ఏం చెయ్యాలో తోచక ఏడుపు లఖించుకుంటారు.  కానీ ఆ చిన్నారి అలా చేయలేదు. పరిస్థితిని అర్థం చేసుకుని.. రైల్వే పోలీసులకు సమాచారం అందించి.. తనవారి ప్రాణాలు కాపాడింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ మురాదాబాద్​లోని ఓ రైల్వే స్టేషన్​లో జరిగింది.

తల్లి అకస్మాత్తుగా పడిపోయింది. ఎంతలేపినా స్పృహ రావడం లేదు. తమ్ముడేమో ఏడుస్తున్నాడు. దీంతో ఆ చిన్నారి.. తన చిట్టి పాదాలతో అడుగుల వేసుకొని నెమ్మదిగా వంతెన దిగింది. కానీ అక్కడి ఎవరికి ఈ విషయం చెప్పాలో తెలియక అయామయంగా చుట్టూ చూడటం మొదలుపెట్టింది. రైల్వే మహిళ పోలీసు వైపు కనిపించడంతో ఆమె వైపు దీనంగా చూసింది. ఏదో చెప్పాలని చూస్తున్న ఆ చిన్నారి మనసును ఆ విమెన్ కానిస్టేబుల్ అర్థం చేసుకుంది. దగ్గరకు వెళ్లి, ఏం జరిగిందని పోలీసుల అడితే.. వచ్చీరాని మాటలతో విషయం చెప్పలేకపోయినప్పటికీ… వారిని తన తల్లి వద్దకు తీసుకెళ్లింది. అక్కడికి వెళ్లి.. చిన్నారి తల్లిని చూసిన వెంటనే అంబులెన్స్​లో జిల్లా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. తల్లి, తమ్ముడి వద్దకు పోలీసులను తీసుకెళ్లిన తర్వాత.. ఇక తన తల్లికి ఏం కాదని ఆనందం ఆ చిన్నారి ముఖంలో కనిపించింది. ప్రస్తుతం ఆ పాప తల్లి, తమ్ముడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. అయితే ఆమె స్పృహలో లేకపోవడం వల్ల వారు ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడికి వెళ్తున్నారో అధికారులు గుర్తించలేకపోయారు.

Also Read: జైలులో మగ ఖైదీలకు చుక్కలు చూపించిన మహిళా అధికారిణి.. మరీ ఇంత దారుణమా..?

ఎంగేజ్మెంట్ తోనే ఎండ్ కార్డ్ .. పెళ్లిపీటలెక్కకుండానే విడిపోయిన జంటలు

అప్పుడు క్రికెట్‏లో ఫాస్ట్ బౌలర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో పాపులర్..
అప్పుడు క్రికెట్‏లో ఫాస్ట్ బౌలర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో పాపులర్..
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
ఇకపై UPI లావాదేవీలు ఫ్రీ కాదా? ట్రాన్సాక్షన్‌కు పడే ఛార్జి ఎంత
ఇకపై UPI లావాదేవీలు ఫ్రీ కాదా? ట్రాన్సాక్షన్‌కు పడే ఛార్జి ఎంత
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, టీవీల ధరలు!
పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, టీవీల ధరలు!
దేశంలో మొట్టమొదటి శక్తి దేవాలయం.. ఎక్కడ ఉందో తెలుసా..?
దేశంలో మొట్టమొదటి శక్తి దేవాలయం.. ఎక్కడ ఉందో తెలుసా..?
స్టార్ హీరో స్టన్నింగ్ లుక్ వెనుక ఉన్న అసలు మ్యాజిక్ ఏంటో తెలుసా?
స్టార్ హీరో స్టన్నింగ్ లుక్ వెనుక ఉన్న అసలు మ్యాజిక్ ఏంటో తెలుసా?
Video: మైదానంలో ఘోర ప్రమాదం.. ఒకే బంతికి రెండుసార్లు..
Video: మైదానంలో ఘోర ప్రమాదం.. ఒకే బంతికి రెండుసార్లు..
ఆర్బీఐ కీలక నిర్ణయం.. వారికి రూ.30 లక్షల వరకు బెనిఫిట్
ఆర్బీఐ కీలక నిర్ణయం.. వారికి రూ.30 లక్షల వరకు బెనిఫిట్
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌!
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌!