- Telugu News India News Telangana pcc chief revanth reddy meets congress senior leaders konijeti rosaiah mallikarjun kharge dk shivakumar
Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలుస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్.. రోశయ్య, మల్లిఖార్జున ఖర్గేతో భేటీ.. చిత్రాలు..
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి వరుసగా కాంగ్రెస్ నేతలను కలుసుకుంటున్నారు. కాగా, ఈ నెల 7వ తేదీన టీపీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలను రేవంత్ రెడ్డి స్వీకరించనున్నారు.
Updated on: Jul 05, 2021 | 2:09 PM

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి వరుసగా కాంగ్రెస్ నేతలను కలుసుకుంటున్నారు. కాగా, ఈ నెల 7వ తేదీన టీపీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలను రేవంత్ రెడ్డి స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ నేతలకు ఆయన ఆహ్వానం పంపుతున్నారు.

ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యను ఆయన నివాసంలో రేవంత్ రెడ్డి కలుసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ను రోశయ్య అభినందించారు. రోశయ్యను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని రేవంత్ అన్నారు.

బెంగుళూరులో రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు మల్లిఖార్జున్ ఖర్గేతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మర్యాద పూర్వకంగా ఆయనను కలుసుకున్న రేవంత్ రెడ్డి.. పదవి బాధ్యతలస్వీకరణకు అహ్వానించారు.

కర్ణాటక పీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్‌ను తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. బెంగళూరు వెళ్లిన రేంత్ ఆయనతో సమావేశమయ్యారు.
