‘దేవేంద్ర ఫడ్నవిస్ అలాఅన్నారా’..? అయితే ఆమిర్ ఖాన్, కిరణ్ రావు వంటిదే మా పొత్తు’..శివసేన నేత సంజయ్ రౌత్
బీజేపీ- శివసేన మధ్య సంబంధాలు ఆమిర్ ఖాన్, కిరణ్ రావు వంటివేనని శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీలూ శతృవులు కావని..
బీజేపీ- శివసేన మధ్య సంబంధాలు ఆమిర్ ఖాన్, కిరణ్ రావు వంటివేనని శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీలూ శతృవులు కావని..విభేదాలున్నా వీటి మధ్య సంబంధాలు ఉంటాయని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన ఈ మాటలన్నారు. తాము భారత-పాకిస్తాన్ దేశాల వంటివారం కామని.. అసలు ఆమిర్ ఖాన్-కిరణ్ రావు మధ్య ఏం జరిగిందో చూడండని ఆయన అన్నారు. సేన- బీజేపీ మధ్య రాజకీయ పంథాలు వేరువేరయినా స్నేహం చెక్కు చెదరదని ఆయన చెప్పారు. తాను బీజేపీ నేత ఆశిష్ షెలార్ తో ఈ నెల 3 న సమావేశమైనట్టు వచ్చిన వార్తలను సంజయ్ ఖండించారు. ఇవి ఊహాగానాలన్నారు. ఫడ్నవిస్ తన ప్రసంగంలో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అయితే ఆ బీజేపీ నేత ఎవరో తనకు తెలియదని ఆయన అన్నారు. మహారాష్ట్రలో ఇటీవలి కాలంలో కమలం పార్టీ-సేన మధ్య మెల్లగా ఫ్రెండ్ షిప్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపినప్పటికీ సేన.. బీజేపీ పట్ల మెతక వైఖరిని ప్రదర్శిస్తోంది. అటు బీజేపీ కూడా అవకాశం వస్తే మళ్ళీ శివసేనతో అంటకాగడానికి యత్నిస్తోంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని ఫడ్నవిస్ వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శనం. అటు తాజాగా సంజయ్ రౌత్ కూడా పరోక్షంగా ఇదే వ్యాఖ్య చేశారు.
కాగా బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, కిరణ్ రావు తాము విడిపోతున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం గమనార్హం.. డైవోర్స్ తీసుకున్నా తాము స్నేహంగానే ఉంటామని.. తమ చైల్డ్ ఆజాద్ కి కో-పేరెంట్స్ గా ఉంటామని వారు స్పష్టం చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: బీజేపీ-శివసేన మధ్య మళ్ళీ చిగురిస్తున్న స్నేహం..రాజకీయ కాక రేపుతున్న దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యలు
Festivals In Week: ఈ వారంలో ఉన్న పండుగలు ఏంటో తెలుసా.. ఆషాడం అమావాస్య ఎప్పుడంటే..