AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్తి కోసం బాంధవ్యాలు మట్టిపాలు! ఇలాంటి మనవళ్లూ ఉన్నారు లోకంలో..

వృద్ధాప్యంలో ఆసరాగా ఉండవల్సిన మనవడే.. ఆస్తి కోసం వృద్ద దంపతులను వీధిపాలు చేశాడు. జీవితమంతా రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన ఇంటిని తన పేర రాయలేదని ఆ పండుటాకుల పాలిట యమ కింకరుడిగా మారాడు. చేసేదిలేక చివరకు పోలీసులను ఆశ్రయించా వృద్ధ దంపతులు..

ఆస్తి కోసం బాంధవ్యాలు మట్టిపాలు! ఇలాంటి మనవళ్లూ ఉన్నారు లోకంలో..
Elderly Couple Scammed Out Of Home By Grandson
G Sampath Kumar
| Edited By: |

Updated on: Jul 24, 2025 | 3:55 PM

Share

నానాటికీ మానవత్వం మంట కలుస్తోంది. ఇంటి కోసం వృద్ద దంపతులను వీధిపాలు చేశాడో మనువడు. వృద్ధాప్యంలో నానమ్మ, తాతకు ఆసరాగా ఉండవల్సిన మనవడే.. దారి తప్పాడు. అనారోగ్యంతో బాధ పడుతున్న వృద్ధుల బాగోగులు చూడకుండా.. నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటి వేసాడు. ఈ బాధలన్నీ భరించలేక.. పోలీసులను ఆశ్రయించారు ఆ వృద్ధ దంపతులు. తమను తమ మనుమడు ఇంటి నుంచి గెంటేశాడని, న్యాయం చేయాలని వృద్ధ దంపతులు పట్టణ పోలీసులను ఆశ్రయించారు.

జగిత్యాల పట్టణంలోని బీర్పూర్ మండలకేంద్రంలో హనుమాన్ వాడకు చెందిన అంకం చంద్రయ్య, లక్ష్మీబాయికి కొడుకు, కూతురు సంతానం. 13 ఏళ్ల క్రితం కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు. వీరికి హనుమాన్ వాడలో చిన్న ఇల్లు ఉంది. చంద్రయ్య పేరున ఉన్న ఆ ఇల్లును తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలనీ మనుమడు సతీశ్ కొద్దిరోజులుగా ఒత్తిడి తెస్తున్నాడు. దానికి వృద్ధు దంపతులు ఒప్పుకోకపోవడంతో.. సతీశ్ ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో ఆ వృద్ధ దంపతులను కూతురు మంజుల ఇంటికి వెళ్లారు. మంజుల ఇంటికి వెళ్లిన సతీశ్ అక్కడ వృద్ధులపై దాడికి ప్రయత్నించాడు.

దీంతో వృద్ధ దంపతులు పట్టణ సీఐ కరుణాకర్‌కి ఫిర్యాదు చేసి తమను ఆదుకోవాలని కోరారు. తాము ఎక్కడ ఉండాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్థి కోసం.. మనువడు వేదిస్తున్నాడని చెబుతున్నారు. కనీసం..కూతురు దగ్గర కూడా ఉండనివ్వడం లేదని అంటున్నారు. వృద్ధ దంపతులను వేదిస్తున్న సతీష్‌కి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, మాట వినకపోతే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని సీఐ కరుణాకర్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.