Telangana: కన్న కూతురే మోసం చేస్తే ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలి.. కంటతడి పెట్టిస్తోన్న సంఘటన.

తల్లిదండ్రులు తమ పిల్లల సంక్షేమం కోసమే పరితపిస్తుంటారు. తాము తిన్నా తినకున్నా బిడ్డలు సంతోషంగా ఉండాలని భావిస్తుంటారు. అందుకోసమే జీవితాంతం కష్టపడుతుంటారు. తమ సంతోషాలను, ఇష్టాలను త్యాగం చేసి పిల్లల్ని ప్రయోజకులను చేయాలనుకుంటారు. అయితే ఆ పిల్లలు కృతజ్ఞతను మరిచి సొంత..

Telangana: కన్న కూతురే మోసం చేస్తే ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలి.. కంటతడి పెట్టిస్తోన్న సంఘటన.
Follow us

|

Updated on: Dec 04, 2022 | 8:08 AM

తల్లిదండ్రులు తమ పిల్లల సంక్షేమం కోసమే పరితపిస్తుంటారు. తాము తిన్నా తినకున్నా బిడ్డలు సంతోషంగా ఉండాలని భావిస్తుంటారు. అందుకోసమే జీవితాంతం కష్టపడుతుంటారు. తమ సంతోషాలను, ఇష్టాలను త్యాగం చేసి పిల్లల్ని ప్రయోజకులను చేయాలనుకుంటారు. అయితే ఆ పిల్లలు కృతజ్ఞతను మరిచి సొంత తల్లిదండ్రులనే మోసం చేస్తే ఎలా ఉంటుంది.? ఆ బాధ మాటల్లో కూడా వర్ణించలేము కదూ. తాజాగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఓ సంఘటన మానవత్వాన్నే ప్రశ్నిస్తోంది.

వివరాల్లో వెళితే.. కామారెడ్డి జిల్లాలోని పిట్లం మండల కేంద్రానికి చెందిన వీరయ్య చారి, అంజవ్వలకు వెంకటేశం, శ్రీనివాస్‌లతో పాటు అనిత సంతానం. పెద్ద కుమారు వెంకటేశం అనారోగ్యంతో మరణించగా, చిన్న కుమారుడు శ్రీనివాస్‌ నిజామాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. దీంతో అనిత బాన్సువాడ పట్టణం బండగల్లిలోని తన ఇంట్లోనే తల్లిదండ్రుల బాధ్యతను చూసుకుంటానంటూ తీసుకెళ్లింది.

అయితే కొన్ని రోజులు అంతా బాగానే ఉన్నా ఆ తర్వాత అనిత కన్నింగ్ గుణం బయటపెట్టింది. తల్లి దగ్గర ఉన్న 15 తులాల బంగారం, రూ. 10 లక్షల నగదును కాజేసింది. దీనికి అనిత భర్త కూడా సహకరించాడు. దీంతో తమ బిడ్డ అన్యాయం చేసిందని ఆ వృద్ధ తల్లిదండ్రులు న్యాయపోరాటానికి దిగారు. కూతురు ఇంటి ముందే దీక్షకు దిగారు. తమకు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమవుతున్నారు. డబ్బులు ఇవ్వకుంటే ఇంటి ముందే ప్రాణాలు వదులుతామని బోరున విలపిస్తున్నారు. ఇది తెలిసిన స్థానికులు కన్న కూతురే ఇలా తల్లిదండ్రులను మోసం చేయడాన్ని తప్పుపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..