News Watch: ఫిర్యాదు కాపీ ఇచ్చాకే విచారణకు వస్తా..! మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్..

News Watch: ఫిర్యాదు కాపీ ఇచ్చాకే విచారణకు వస్తా..! మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్..

Shaik Madar Saheb

|

Updated on: Dec 04, 2022 | 7:42 AM

డిసెంబర్ 6న సీబీఐ విచారణకు కవిత వెళ్తారా..? ఒకవేళ వెళితే.. అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేయబోతున్నారనే దానిపైనే ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఇలాంటి టైమ్‌లో తనకు నోటీసులు ఇచ్చిన సీబీఐకి ప్రతిస్పందనగా కవిత లేఖ రాశారు.



ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కవితకు నోటీసులు ఇవ్వడం రాజకీయ కుట్రలో భాగమని గులాబీ శ్రేణులు ఆరోపిస్తుంటే.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని కౌంటర్ ఇస్తున్నారు కాషాయం పార్టీ పెద్దలు. సీనులోకి ఎంటర్‌ అయిన కాంగ్రెస్.. లిక్కర్ స్కామ్‌లో కవితను, సిట్‌ కేసులో బీఎల్‌ సంతోష్‌ను అరెస్టు చేయాలంటోంది. ఈ క్రమంలో.. డిసెంబర్ 6న సీబీఐ విచారణకు కవిత వెళ్తారా..? ఒకవేళ వెళితే.. అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేయబోతున్నారనే దానిపైనే ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఇలాంటి టైమ్‌లో తనకు నోటీసులు ఇచ్చిన సీబీఐకి ప్రతిస్పందనగా కవిత లేఖ రాశారు. ఒరిజినల్ ఫిర్యాదు కాపీ, దాని ఆధారంగా నమోదైన ఎఫ్‌ఐఆర్ కాపీ తనకు ఇవ్వాలని కోరారు. అవి ఇచ్చిన తర్వాతే వివరణ ఇచ్చేందుకు డేట్‌ ఫిక్స్ చేయాలంటూ సీబీఐ అధికారి అలోక్‌ షాహీకి కవిత లెటర్ పంపారు.

Published on: Dec 04, 2022 07:42 AM