Allu Arjun: మామ కోసం రంగంలోకి ఐకాన్ స్టార్.. నల్గొండ జిల్లాలో అల్లు అర్జున్ పర్యటన.. వీడియో చూడండి..
Allu Arjun Nagarjuna Sagar Visit: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పర్యటిస్తున్నారు. భట్టుగూడెంలో తన మామ, బీఆర్‌ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి స్వగ్రామం దగ్గర నిర్మించిన ఫంక్షన్‌హాల్‌ను ఆయన ప్రారంభించనున్నారు. పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి భట్టుగూడెం వద్ద 'కంచర్ల కన్వెన్షన్' పేరుతో ఈ ఫంక్షన్‌హాల్‌ను నిర్మించారు.
Allu Arjun Nagarjuna Sagar Visit: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పర్యటిస్తున్నారు. భట్టుగూడెంలో తన మామ, బీఆర్‌ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి స్వగ్రామం దగ్గర నిర్మించిన ఫంక్షన్‌హాల్‌ను ఆయన ప్రారంభించనున్నారు. పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి భట్టుగూడెం వద్ద ‘కంచర్ల కన్వెన్షన్’ పేరుతో ఈ ఫంక్షన్‌హాల్‌ను నిర్మించారు. ఇప్పటికే ఆయన పెద్దవూర మండలం కేంద్రంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా ఆధునిక వసతులతో కూడిన 1000 మందికి సరిపడే ఫంక్షన్‌హాల్‌ను నిర్మించారు. ప్రారంభోత్సవానికి తన అల్లుడైన అల్లు అర్జున్, మంత్రి జగదీశ్‌రెడ్డిని ఆయన ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుమారు 10 వేల మందికి భోజనాలతో పాటు మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నారు. నాగార్జునసాగర్ బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న అల్లు అర్జున్ మామ, స్నేహా రెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.. ఇప్పటినుంచే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.