TSPSC Revised Exam Dates: ఆ పరీక్షల తేదీల్లో మార్పులేదు.. మిగతా పరీక్షల రీషెడ్యూల్‌పై టీఎస్‌పీఎస్సీ కసరత్తులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. టీఎస్‌పీఎస్సీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏవో, ఏఈ పరీక్షల్ని టీఎస్‌పీఎస్సీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. వీటిల్లో కొన్ని..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. టీఎస్‌పీఎస్సీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏవో, ఏఈ పరీక్షల్ని టీఎస్‌పీఎస్సీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. వీటిల్లో కొన్ని పరీక్షలను రీషెడ్యూలు చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. వేటిని రీషెడ్యూలు చేయాలి, వేటిని యథాతథంగా కొనసాగించవచ్చన్న విషయమై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మార్చిలో జరగాల్సిన టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల పరీక్షలను వాయిదా వేసింది.
ఇక ఏప్రిల్, మేలో జరగాల్సిన పరీక్షల తేదీలూ రీషెడ్యూలయ్యే అవకాశమున్నట్లు సమాచారం. రద్దుచేసిన, వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించిన కొత్త పరీక్ష తేదీలను ఈ నెలాఖరులోగా ప్రకటించే అవకాశం ఉంది. ఐతే పరీక్షకు రెండు నెలల ముండే ప్రశ్నాపత్రాలు సిద్ధం చేయవల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రానున్న రెండు నెలల్లో జరగాల్సిన పరీక్షలకు ప్రశ్నపత్రాలను సిద్ధం చేయడానికి కొంత సమయం పట్టనుంది. 40 వేల కన్నా ఎక్కువ మంది పోటీపడే పరీక్షలను ఓఎంఆర్‌పద్ధతిలో, అంతకన్నాతక్కువగా సంఖ్యలో హాజరయ్యే పోస్టులకు ఆన్‌లైన్ పద్ధతిలో పరీక్షలు పెట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించే పరీక్షలకు ప్రశ్నపత్రం సిద్ధం చేసి, ముద్రించి, పరీక్ష కేంద్రాలకు సరఫరా చేయడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్షలనైతే యథాతథంగా ముందుగా నిర్ణయించిన ప్రకారంగానే అదే తేదీల్లో వేగంగా నిర్వహించి, ఫలితాలు కూడా వెంటనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. గ్రూప్ 1 పరీక్ష రద్దు చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ను తొలుత నిర్వహించి.. ముందుగా ప్రకటించిన విధంగా జులై 1న గ్రూప్-4, ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాలనే యోచనలో ఉంది. ఇలా వరుసగా మూడింటినీ నిర్వహిస్తే అభ్యర్థులకు ఎవైనా ఇబ్బందులు తలెత్తుతాయా అనే కోణంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకున్న తర్వాత ఫైనల్‌గా పరీక్షల తేదీలన ఖరారు చేసే అవకాశముంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.