Telangana SI Exam: తెలంగాణ ఎస్సై (పీటీవో) ఉద్యోగాలకు మార్చి 26న పరీక్ష.. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ఇలా..
తెలంగాణ పోలీసు ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్ (పీటీవో)లో సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలకు మార్చి 26న టెక్నికల్ పేపర్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఛైర్మన్..
తెలంగాణ పోలీసు ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్ (పీటీవో)లో సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలకు మార్చి 26న టెక్నికల్ పేపర్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఛైర్మన్ వివి శ్రీనివాసరావు ఆదివారం (మార్చి 19) ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో మార్చి 26న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పరీక్ష జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు మార్చి 21 ఉదయం 8 నుంచి మార్చి 24వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత, దానిపై అభ్యర్థులు తమ పాస్‌పోర్టు సైజ్ ఫొటో అంటించాలన్నారు. లేనిపక్షంలో దాన్ని పరిగణనలోకి తీసుకోబోమన్నారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడంలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే support@tslprb.inకి ఈ-మెయిల్ చేయడం, లేదా 93937 11110, 93910 05006 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. ఇదే ఉద్యోగానికి సంబంధించి నిర్వహించబోయే తదుపరి రెండు పరీక్షలకు హాల్‌టికెట్లు వేర్వేరుగా జారీ చేస్తామని, ఈ విషయంలో ఎటువంటి సందిగ్థత అవసరం లేదని ఛైర్మన్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.