GAIL Recruitment: గెయిల్ ఇండియాలో భారీగా ఉద్యోగాలు.. నెలకు 60 వేలు జీతం పొందే అవకాశం.
గెయిల్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా అసోసియేట్/జూనియర్ (టెక్నికల్) సహా మొత్తం 120 పోస్టులను భర్తీ చేయనున్నారు...
గెయిల్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా అసోసియేట్/జూనియర్ (టెక్నికల్) సహా మొత్తం 120 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ మార్చి 10వ తేదీన ప్రారంభం కాగా ఏప్రిల్ 10వ తేదీతో ముగియ నుంది. ఈ నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా ఎంపిక చేయనున్నారు లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 120 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో సీనియర్ అసోసియేట్ (టెక్నికల్) (72), సీనియర్ అసోసియేట్ (ఫైర్ & సేఫ్టీ) (12), సీనియర్ అసోసియేట్ (మార్కెటింగ్) (06), సీనియర్ అసోసియేట్ (ఫైనాన్స్ & అకౌంట్స్) ( 06), సీనియర్ అసోసియేట్ (హెచ్ఆర్) (06), జూనియర్ అసోసియేట్ (టెక్నికల్) (16) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత విభాగాల్లో డిగ్రీ/పీజీ/డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 32 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్నత అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
* సీనియర్ అసోసియేట్ పోస్టులకు ఎంపికై వారికి నెలకు రూ. 60,000, జూనియర్ అసోసియేట్ పోస్టులకు నెలకు రూ. 40,000 జీతంగా అందిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 10వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..