Assam rifles: అస్సాం రైఫిల్స్ 616 ఖాళీలు.. దరఖాస్తులకు నేడే చివరి తేదీ.
షిల్లాంగ్‌లోని అస్సాం రైఫిల్స్, డైరెక్టర్ జనరల్ కార్యాలయం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. గ్రూప్ బి, గ్రూప్ సి విభాగాల్లో రాష్ట్రాల వారీగా టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఖాళీల భర్తీకి సంబంధించి మే నెలలో..
షిల్లాంగ్‌లోని అస్సాం రైఫిల్స్, డైరెక్టర్ జనరల్ కార్యాలయం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. గ్రూప్ బి, గ్రూప్ సి విభాగాల్లో రాష్ట్రాల వారీగా టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఖాళీల భర్తీకి సంబంధించి మే నెలలో రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది. వీటిలో తెలుగు రాష్ట్రాల వారికి కూడా పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుల స్వీకరణకు నేటితో గడువు ముగియనున్న నేపథ్యంలో, ఏయే విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీచేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 616 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పురుషులు, మహిళలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
* టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ పోస్టులు ఉన్నాయి. వీటిలో ఏపీలో 25, తెలంగాణలో 27 ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, 10+2, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటితో (19-03-2023) ముగియనుంది.
* ర్యాలీని 01-02-2023 నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..