ఒకప్పటి హీరోలు.. ఇప్పుడు జీరోలు..! కోమటి రెడ్డి బ్రదర్స్‌ రాజకీయ అడుగులు ఎటువైపు..?

కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ వెంకట్ రెడ్డి పార్టీ తరఫున ప్రచారం చేయలేదు. సరికదా విదేశాలకు వెళ్లి.. తన తమ్ముడికి సపోర్ట్ చేయాలని చెప్పిన వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి . కోమటిరెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా వచ్చిన ఆడియో, వీడియో..

ఒకప్పటి హీరోలు.. ఇప్పుడు జీరోలు..! కోమటి రెడ్డి బ్రదర్స్‌ రాజకీయ అడుగులు ఎటువైపు..?
Komatireddy Brothers
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 09, 2022 | 1:00 PM

కన్ఫ్యూజన్, కన్ఫ్యూజన్ తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడంతా ఒకటే కన్ఫ్యూజన్.. కోమటిరెడ్డి వ్యవహారం పై అదిష్టానం సీరియస్ గా ఉందా…? ఈసారి కోమటిరెడ్డి పై చర్యలకు సంబంధించి గాంధీ భవన్ లో జరుగుతున్న చర్చ ఏంటి…? మరో వైపు తమ్ముడు బాటలోనే అన్న వస్తాడన్న రాజగోపాల్ ప్రచారంలో వాస్తవమెంత..? తాజాగా కోమటిరెడ్డి పరిస్థితి రెంటికి చెడ్డ రెవడిలా తయారైందా…? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎవరినీ కదిలించిన ఇదే కన్ఫ్యూజన్. ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర, మునుగోడు ఎన్నికలంటూ నేతలంతా హడావిడిగా గడిపారు. ఇప్పుడు ఆ రెండు రాష్ట్రంలో పూర్తవడంతో తెలంగాణ కాంగ్రెస్ లో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి మునుగోడు అభ్యర్థిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ వెంకట్ రెడ్డి పార్టీ తరఫున ప్రచారం చేయలేదు. సరికదా విదేశాలకు వెళ్లి.. తన తమ్ముడికి సపోర్ట్ చేయాలని చెప్పిన వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి . కోమటిరెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా వచ్చిన ఆడియో, వీడియో ట్రోల్ కావడంతో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీచేసింది.ఇప్పటికే తాను వివరణ ఇచ్చానని ఆడియో, వీడియోలు ఫేక్ అని కొట్టిపారేశారు.

కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ నేత ఎంపీ జైరాం రమేశ్ నిన్న భారత్ జోడో యాత్రలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇష్యుపై సీరియస్ అయ్యారు. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం అని తెలిపారు. గీత దాటితే చర్యలు తప్పవని ఒకింత ఘాటుగానే చెప్పారు. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని తెలిపారు. షోకాజ్ నోటీసుకు రెండు రోజుల క్రితమే సమాధానం ఇచ్చానని తెలిపారు. డిసిప్లినరీ కమిటీ చైర్మన్ తారిక్ ఆన్వర్ ఆందుబాటులో లేరని వివరించారు. ప్రస్తుతం తన నియోజకవర్గ పనుల కోసం తిరుగుతున్నానని చెప్పారు. షోకాజ్ నోటీసు ఇచ్చిన సమయంలో పాదయాత్రలో ఎలా పాల్గొనాలని ఎదురు ప్రశ్నించారు. క్లీన్ చీట్ వచ్చాకే జోడో యాత్రలో పాల్గొంటానని వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. మరొకవైపు అధిష్టానం తనపై ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూసే ధోరణిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నట్లు సమాచారం. బిజెపిలో తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గెలిచి ఉంటే కోమటిరెడ్డి బిజెపిలోకి వెళ్లే వాడని గుసగుసలు వినిపిస్తున్నాయి .. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఓటమి తో పార్టీ మరాలనే ఆలోచన ఏ పార్టీ నేతలు కూడా ముందడుగు వేయడం లేదట..దీనికి కోమటిరెడ్డి కూడా మనహాయింపు కాదు..

మరోవైపు కోమటిరెడ్డి ఆదనుకోసం చూస్తున్నట్టు గుసగుసలు… తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మునుగోడు లో విజయం సాధిస్తే వెంటనే కోమటిరెడ్డి బీజేపీ కండువా కప్పుకునేల ఒక ప్లాన్ ఉండేదని కానీ ఇప్పుడు మరోలా ఉందని తెలుస్తోంది.. ఇప్పటికిప్పుడు పార్టీ మారితే ఇబ్బందులు తప్పవనే కోమటిరెడ్డి అకోచిస్తున్నట్టు వినికిడి.. మరోవైపు ఈసారి కోమటిరెడ్డి పై వేటు తప్పదని పార్టీ నుండి తొలగిస్తారనే ప్రచారం గాంధీ భవన్ లో జోరుగా చర్చ జరుగుతోంది.. మరోవైపు మునుగోడు లో పార్టీ దారుణ ఓటమికి కోమటిరెడ్డి వ్యవహారశైలి కారణమని కోమటిరెడ్డి పై చర్యలు తీసుకోవాలని ఓ వర్గం నేతలు పట్టుబడుతున్నారు.. మరోవైపు త్వరలోనే తన అన్న తనతో పాటు వస్తాడని రాజగోపాల్ రెడ్డి సన్నిహితులతో చెబుతున్నారట.. తమ్ముడే అంగ అర్ధ బాలలు ఉపయోగించిన అక్కడ ఓటమి పాలవడంతో తాను వెళ్తే పరిస్థితి ఏంటా అని కోమటిరెడ్డి రెంటికి చెడ్డ రెవడి లా కోమటిరెడ్డి పరిస్థితి తయారయిందట..

ఇవి కూడా చదవండి

మరోవైపు కోమటిరెడ్డి పై అదిష్టానం సైతం వేచి చూసే ధోరణి లోనే వ్యవహరించడం పై పార్టీ లోని ఓ వర్గం నేతలు గుర్రుగా ఉన్నారట .. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ కోమటిరెడ్డి పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని జోరు మిదున్న పార్టీ సంక్షోభం వైపుకు పోవడానికి కోమటిరెడ్డి వ్యవహారశైలి కారణమని ఠాగూర్ దృష్టికి తీసుకెళ్లారు.. అయితే కోమటిరెడ్డి వ్యవహారం అంత ఏఐసిసి చూసుకుంటుందని ఏఐసీసీ ఎం చేసిన అందరూ పాటించాల్సిందే నని ఠాగూర్ సూచించినట్లు సమాచారం..

కోమటిరెడ్డి పార్టీకి నష్టం జరిగేలా వ్యాఖ్యలు చేసిన..పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చిన ఇంత వరకు ఆయన వ్యవహారం పై ఇటు పార్టీ గాని కోమటిరెడ్డి గాని స్పందించకపోవడం తో అదిష్టానం ఎం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి..

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!