Health tips: ఈ ఒక్క పదార్థాన్ని పాదాలు, అరికాళ్లపై రాస్తే చాలు.. నిద్రలేమితో పాటు ఈ సమస్యలన్నీ మాయం!

పాదాలు శరీరంలో ముఖ్యమైన భాగాలు. శరీరానికి సంబంధించిన అన్నినరాలు అక్కడే నిలిచి ఉంటాయి. కాబట్టి.. అరికాళ్లను మసాజ్ చేయడం ద్వారా నరాలు బలోపేతమవుతాయి. ఎసిడిటీ తగ్గుముఖం పడుతుంది. మంచి నిద్ర పడుతుంది. ఇక ముఖ్యంగా..

Health tips: ఈ ఒక్క పదార్థాన్ని పాదాలు, అరికాళ్లపై రాస్తే చాలు.. నిద్రలేమితో పాటు ఈ సమస్యలన్నీ మాయం!
Ghee Health Benefits
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 09, 2022 | 12:03 PM

అనేక సమస్యలను అధిగమించేందుకు పురాతన కాలంలో నెయ్యిని ఉపయోగించేవారు. మరోవైపు, అరికాళ్లపై నెయ్యి రాస్తే, దాని వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి. పాదాల అరికాళ్లపై నెయ్యి రాయడం వల్ల శారీరకంగానూ, మానసికంగానూ ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కేవలం నిద్ర మాత్రమే కాదు. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి లభిస్తాయి. ప్రజలు ఈ ప్రయోజనాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అరికాళ్లకు నెయ్యి రాసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

అరికాళ్లపై నెయ్యి రాయడం వల్ల కలిగే ప్రయోజనాలు.. అరికాళ్లకు నెయ్యితో మసాజ్ చేయడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. రిలాక్స్‌గా ఫీల్ కావడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. అరికాళ్లకు నెయ్యి రాసుకుంటే ఆయాసం తొలగిపోతుంది. మంచి నిద్ర రావడమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఉదయం నిద్రలేచేప్పుడు ఎంతో ఫ్రెష్‌గా కూడా అనిపిస్తుంది. దీన్ని మీరు అలవాటుగా చేసుకుంటే.. గురక, మధ్య రాత్రిళ్లు మెళకువ, అజీర్ణం, పిత్తులు, తేన్పులు, పేగు సంబంధిత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

పాదాలు శరీరంలో ముఖ్యమైన భాగాలు. శరీరానికి సంబంధించిన అన్నినరాలు అక్కడే నిలిచి ఉంటాయి. కాబట్టి.. అరికాళ్లను మసాజ్ చేయడం ద్వారా నరాలు బలోపేతమవుతాయి. ఎసిడిటీ తగ్గుముఖం పడుతుంది. మంచి నిద్ర పడుతుంది.  అరికాళ్లపై నెయ్యి రాసుకుంటే జలుబు నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. ఇందుకోసం అరికాళ్ళపై గోరువెచ్చని నూనెను పూయాలి. ఇలా చేయడం వల్ల జలుబు, ఫ్లూ నుండి ఉపశమనం పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

రక్త ప్రసరణను పెంచడానికి మీరు వారానికి కనీసం రెండుసార్లు అరికాళ్లపై కూడా నెయ్యి రాసుకోవాలి. ఇది పాదాల నొప్పి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. వెన్నునొప్పి కూడా నయమవుతుంది. ఎముకలు దృఢంగా ఉండాలంటే అరికాళ్లకు నెయ్యితో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల కొవ్వు తగ్గడమే కాకుండా చర్మం రంగులో కూడా మార్పు వస్తుంది. ఒక వేళ నెయ్యి అందుబాటులో లేకపోతే కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!